మోనిత బాబు మిస్సింగ్..ఆ పని చేసింది అతనే?

కార్తీక దీపం సీరియల్ లో ఇప్పుడు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు జరుగుతున్నాయి.డాక్టర్ బాబూ లైసెన్స్ రద్దు అయిన విషయం తెలిసిందే.ఆ విషయం తన పిల్లలకు కూడా చెబుతున్నారు. తను డాక్టర్ అన్న విషయం ఎక్కడా చెప్పొద్దని చెబుతాడు.ఎరువుల కొట్టులో అకౌంట్స్ రాస్తాడని చెప్పండి అనేసరికి పిల్లలిద్దరూ బాగా ఎమోషనల్ అవుతారు..ఇక దీప ఏమో స్కూల్ లో భోజనం చేయడానికి ఒప్పుకుంది.

మరోవైపు రుద్రాణి మనుషులు కార్తీక్ కొట్టాడన్న విషయాన్ని చెప్పినా కూడా రుద్రాణి పట్టించుకోదు. ఇక మోనిత ప్రియమణి లేకుండా తన బాబు ని తీసుకొని షాపింగ్ కి వస్తుంది. ఇక బాబును కారులో వదిలేసి అక్కడ ఓ వ్యక్తిని చూసుకోమని చెప్పి వెళ్తుంది. మోనిత షాపింగ్ పూర్తి చేసుకుని వచ్చే సరికి. బాబు కనిపించకపోయేసరికి టెన్షన్ పడుతుంది. అక్కడ ఉన్న వ్యక్తి ఇక్కడికి ఓ 30 ఏళ్ల వ్యక్తి వచ్చాడని అనడంతో ఇదంతా ఆదిత్య పని అయి ఉండొచ్చని కోపంతో రగిలిపోతుంది..

కట్ చేస్తె..కార్తీక్ గురించి ఇంట్లో అందరూ బాధపడుతుంటారు.అప్పుడే మోనిత ఆవేశంగా వస్తుంది.. కార్తీక్ మన బాబూ మిస్ అయ్యాడు అంటూ  అరుస్తుంది.అప్పుడే సౌందర్య వాళ్ళు బయట ఎవరో వచ్చారని చూడటానికి వెళ్తారు. మరి మోనిత బాబును ఆదిత్యనే ఎత్తుకెళ్లాడని అంటుంది.ఇక సౌందర్య ఎలా బుద్ది చెబుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఎం జరుగుతుందో చూడాలి..

Leave a Comment