నాని ఖాతాలో మరో రికార్డ్ పడినట్లే..

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న సినిమాలు దాదాపు బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ఇప్పుడు మరో సినిమా లో నాని నటిస్తున్నాడు.నాని హీరోగా నటిస్తున్న శ్యామ్‌సింగరాయ్‌ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది.ట్రైలర్ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకునేలా ఉంది. దీంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న  ఈ సినిమా లో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమా డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మంగళవారం వరంగల్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించింది. ఇందులో భాగంగా ట్రైలర్‌ని విడుదల చేసింది. నాని అభిమానులు కోరుకునే అన్ని అంశాలూ ఈ చిత్రంలో ఉన్నట్టు ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తుంది. టైటిల్ కు తగ్గట్లు గా నాని నటిస్తున్నాడు..1970ల కాలం నాటి కథతో కోల్‌కతా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్‌ సంగీతం అందించారు.పాన్ ఇండియా మూవిగా ఈ సినిమా విడుదల కానుంది.

Leave a Comment