ఇదేం చోద్యం రా బాబు.. దారుణం భయ్యా..

ఎవరైనా పెళ్ళి అంటే దేవుడిని ఎక్కువగా ప్రార్దిస్తారు.. పెళ్ళి కార్డు ల పై ఆయన ఫోటోలే వేస్తారు.కానీ ఓ వ్యక్తి పవన్ కళ్యాణ్ ఫోటో వేశాడు. అవును మీరు విన్నది నిజమే. ఓ వ్యక్తి తన పెళ్ళి కార్డు లో దేవుడికి బదులుగా పవన్ కళ్యాణ్ ఫోటో ను వేశాడు. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.మొత్తానికి మనోడు అందరినీ ఆకర్షించాడు.

వివరాల్లొకి వెళితే..శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కేశవరావు పేట గ్రామానికి చెందిన తమ్మినేని శ్రీనివాస్‌, పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. ఈ డిసెంబర్ 18న ఆయన పెళ్లి కుదిరింది. తన జీవితంలో జరగుతున్న శుభకార్యంలో ఈ అభిమాని పవన్ కళ్యాణ్ ఫొటోను ముద్రించుకున్నారు. సాధారణంగా పెళ్లి కార్డులపై దేవతా మూర్తుల బొమ్మలను ప్రింట్ చేసుకుంటారు కదా, మరి మీరెందుకు పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రింట్ చేయించుకున్నారని ఎవరైనా అడిగితే పవన్ కళ్యాణ్ తనకు దేవుడితో సమానం అని, అందుకనే ఆయన ఫొటోలను ముద్రించుకున్నానని అంటున్నాడు. అంతే కాదు పెళ్లిలో భోజనాలకు ఉపయోగించే గ్లాసులు, ప్లేట్లు, బంధువులకి ఇచ్చే బాక్స్ ల పై కూడా అతని ఫోటో వేయించాడు. పిచ్చి పరాకాష్టకు చేరిందంటు కామెంట్లు చేస్తున్నారు.

Leave a Comment