సమంతకు షాకిచ్చిన పురుషుల సంఘం..కారణం ఇదే?

హీరోయిన్ సమంతకు భారీ షాక్ తగిలింది.సమంత పుష్ప సినిమాలో చేసిన ఐటెం సాంగ్ వివాదంలో చిక్కుకుంది. ఊ అంటావా మావా..ఉహు ఉహు అంటావా మావ పాట మగాళ్లను కించపరిచేలా ఉందంటూ ఏపీలోని పురుషుల సంఘం కంప్లైంట్ చేశారు.అల్లు అర్జున్ ,రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తోన్న పుష్ప సినిమాలో సమంత ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా అనే స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.

పాటకు సమంత స్టెప్పులు హైలెట్ గా నిలిచాయి. సాంగ్ రిలీజ్ అయిన కొద్ది రోజులకే షేక్ చేసింది.పురుషుల పై తప్పుడు అభిప్రాయం కలిగించేలా ఉందంటూ ఆంధ్రప్రదేశ్ పురుషుల సంఘం ఫిర్యాదు చేసింది. పుష్ప సినిమాతోపాటు.. ఈ పాటలో నటించిన సమంతపై కూడా పురుషుల సంఘం కేసు పెట్టింది. పాటపై నిషేదం విధించాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది పురుషుల సంఘం..విడుదల కు సిద్ధంగా వున్న ఈ సినిమా కు ఇప్పుడు ఇలా ఆటంకం ఏర్పడటం తో చిత్ర యూనిట్ నిరాశ లో ఉన్నారు. ఈ సినిమా గురించి మరో అప్డేట్ వచ్చేవరకూ ఆగాల్సిందే..

Leave a Comment