జగన్ కు సవాల్ విసిరిన పవన్ కళ్యాణ్..

సినీ నటుడు,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి కి సవాల్ విసిరారు.ప్రస్తుతం పవన్ విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష లో ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన దీక్షకు మద్దతుగా జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఒక్క రోజు దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తనను ఆర్థికంగా దెబ్బతీసేందుకు తన సినిమాలు ఆపేస్తే, ఏపీలో ఉచితంగా సినిమా షోలు వేస్తానని జనసేనాని చెప్పుకొచ్చారు.

అంతేకాదు..సినిమాలు ఆపేస్తే నా ఆర్థికమూలాలు దెబ్బతింటాయని వారు భావిస్తున్నారు. వాళ్లు అంత పంతానికి వస్తే నేను ఆంధ్రప్రదేశ్ లో ఉచితంగా సినిమా వేసి చూపిస్తా. సినిమా టికెట్ ధరల అంశంలో పారదర్శకత లేదని చెబుతున్నారు. మీకుందా పారదర్శకత? మీకంత పారదర్శకత ఉంటే ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు?. ఇదేం అని ప్రశ్నిస్తే అసభ్య పద జాలాన్ని వాడుతున్నారు.మద్యం అధిక ధరలకు అమ్ముతూ కోట్లు కూడబెడుతున్నారు.ఏపీ ప్రభుత్వంపై పవన్ ఫైర్ అయ్యారు. ఆరోగ్యానికి వైసీపీ హానికరం అని అన్నారు. 2024లో కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావాలన్న పవన్, అధికారంలోకి వస్తే వైసీపీ తప్పులకు సమాధానం చెప్పిస్తామన్నారు..ప్రజలు మాకు మద్దతుగా నిలిస్తె అది సాధ్యం అని గుర్తు చేశారు.

Leave a Comment