రెండు పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ హీరోలు వీరే..

సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన వారు రెండుపెళ్లిళ్లు చేసుకోవడం కామన్ అయిపోయింది. అలనాటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేటి పవన్ కల్యాన్ వరకు చాలా మంది ప్రముఖ నటుడు రెండు, మూడేసి పెళ్లిళ్లు చేసుకున్నారు. తాజాగా సీనియర్ నటుడు పవిత్ర లోకేశ్ తో నాలుగోపెళ్లికి సిద్ధమయ్యాడు. అయితే కొందరు మొదటి భార్య మరణించినా.. లేక మనస్పర్థలు వచ్చినా.. రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే చాలా మంది ప్రముఖ నటులే ఒకటికి మించి వివాహం చేసుకున్నారు. నాటి నుంచి నేటి వరకు ఒకటికి మంచి పెళ్లిళ్లు చేసుకున్న హీరోలెవరో చూద్దాం..

ఎన్టీఆర్:
తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్ గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినీ, రాజకీయ ప్రస్థానం కంటే ఫ్యామిలీ ఇష్యూలో కొన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆయన 20 ఏళ్లు ఉండగానే బసవతారకంను పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాతే సినిమాల్లోకి వచ్చారు. అయితే అనుకోకుండా బసవతారకం 1985లోనే మరణించింది. దీంతో 1993లో లక్ష్మీ పార్వతిని రెండో పెళ్లి చేసుకున్నారు.

కమలాహాసన్:
సౌత్ సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కమలాహాసన్ రెండు పెళ్లిళ్లు చేసుకొని మరొకరితో సహజీవనం కొనసాగించారు. మొదటగా వాణి గణపతిని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఆమెకు విడాకులు ఇచ్చి సారికను పెళ్లి చేసుకున్నారు. వీరికి శృతిహాసన్, అక్షర హాసన్ కూతుళ్లు. వీరూ కలిసుండలేదు. అయితే ఆ తరువాత గౌతమితో సహజీవనం కొనసాగించారు.

కృష్ణం రాజు:
రెబల్ స్టార్ గా గుర్తింపు పొందిన కృష్ణం రాజు రెండో పెళ్లి గ్రూపులోకి వస్తారు. ఈయన మొదటగా సీతాదేవిని పెళ్లి చేసకున్నారు. ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆ తరువాత శ్యామలాదేవిని రెండో వివాహం చేసుకున్నారు.

ప్రకాశ్ రాజ్:
విలక్షణ నటుడిగా గుర్తింపు పొందడంతో పాటు జాతీయ అవార్డు అందుకున్న ప్రకాశ్ రాజ్ తెలియని సినీ ప్రేక్షకుడు లేడు. ఈయన ముందుగా లలిత కుమారిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు జన్మించారు. కొన్ని కారణాల వల్ల ఆమెతో విడిపోయి డ్యాన్సర్ పోలీస్ శర్మను వివాహం చేసుకున్నారు.

అక్కినేని నాగార్జున:
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన అక్కినేని నాగార్జున రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదట లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు. వీరికి నాగచైతన్య కుమారుడు పుట్టారు. ఆ తరువాత అమలను పెళ్లి చేసుకున్నాడు. వీరికి అఖిల్ జన్మించాడు.

పవన్ కల్యాణ్:
టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్స్ ప్రపంచాన్ని కలిగిన హీరో ఎవరంటే పవన్ కల్యాణ్ అని చెప్పొచ్చు. ఈయన తన జీవితంలో మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చింది. మొదట నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత ఆమెతో విడాకులు తీసుకొని రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని కారణాల వల్ల రేణుతో విడాకులు తీసుకొని రష్యా నటి అన్న జోలేనావను వివాహం చేసుకున్నారు.

Leave a Comment