బట్టతల సమస్య ఉన్నవారికి ఈ మొక్క వరం లాంటిది..

సాంకేతికం అలవడుతున్న కొద్దీ కోరికలు పెరిగిపోతున్నారు. ఫలితంగా డబ్బుపై వ్యామోహం పెరిగి తీరిక లేకుండా పని చేయాల్సి వస్తోంది. ఈ కారణంగా ఆరోగ్యంపై చాలా మంది శ్రద్ధ వహించడం లేదు. అయితే చిన్న చిన్న చిట్కాలతో, రోజూ వండే కూరలతో ఎన్నో దీర్ఘకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటివి పట్టించుకోకుండా ఆసుపత్రుల్లో లక్షలకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. ఇప్పుడున్న కాలుష్యం, నీటి ప్రభావంతో చాలా మందికి బట్టతల రావడం కామన్ అయిపోయింది. ఇక కొందరికి వయసు మీద పడకముందే వెంట్రుకలు రాలిపోవడం జరుగుతూ ఉంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి ట్రీట్మెంట్ కోసం ఎన్నో రకాలుగా ఖర్చు చేస్తున్నారు. కానీ చిన్న మొక్కతో దీని నుంచి బయటపడవచ్చని ఆయుర్వేద పండితులు తెలుపుతున్నారు.

పట్టణాల్లో కాకుండా పల్లెల్లో ముల్ల వంగ అనే మొక్క ఎక్కువగా కనిపిస్తుంది. కానీ కొందరు దీనిని నిర్లక్ష్యంగా వదిలేస్తారు. దీని ఉపయోగం తెలిస్తే ఎవరూ విడిచిపెట్టరు. కానీ కొందరు పెద్దలు ఈ మొక్క వేరు, ఆకులు, కాయలతో సహా తీసుకెళ్లి పలు సమస్యల నివారణకు ఉపయోగిస్తారు. ముల్లంగి వంగతో తలపై వెంట్రుకలను రప్పించవచ్చని కొందరు వాదిస్తున్నారు. ఎందుకంటే దీనిని ఎక్కువగా ఆయుర్వేద మందుల్లో వాడుతూ ఉంటారు. బట్టతల, పేనుకొరుకుడు వంటి వాటికి కూడా ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయంటున్నారు. అయితే దీనిని ఎలా ఉపయోగించాలంటే..

ముళ్లవంగ కాయలను సేకరించి వాటి నుంచి రసం తీయాలి. ఈ రసంలో తేనె కలిపి జుట్టు ఊడిపోయిన ప్రదేశంలో కొన్ని రోజుల పాటు మర్దనా చేస్తూ ఉండాలి. అలాగే పక్వానికి వచ్చిన కాయలను తీసుకొని సగానికి కోసం అందులోనుంచి గింజలను తీసేయాలి. ఆ తరువాత మిగిలిన గుజ్జు నుంచి రసాన్ని తీసి దానికి సమానంగా మందార పువ్వుల రసాన్ని కలిపి జుట్టు ఊడిన చోట రాయలి. ఇలా రాయడం వల్ల చుండ్రు సమస్య కూడా రాకుండా ఉంటుంది. అరగంటపాటు ఇలా ఉంచకొని ఆ తరువాత స్నానం చేయాలి.

పిప్పళ్లతో బాధపడుతున్న వారికి ముళ్ల వంగ కాయకులు ఎంతో మేులు చేస్తాయి. కాయలను కాల్చగా వాటి నుంచి వచ్చే పొగను నోటితో పీల్చాలి. ఇలా పీల్చడం వల్ల నొప్పి తగ్గుతుంది. ఈ మొక్క ఆకుల రసంలో దూదిని ముంచి నొప్పి ఉన్న చోట ఆ దూదిని పెట్టాలి. ముళ్ల వంగ ఆకుకు విషాన్ని సేకరించే గుణం ఉంటుంది. అందుకు ఇది పిప్పళ్ల సమస్య నుం పారదోలుతుంది.

ఇక ఈ మొక్క వేరు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మొక్క వేరును నీటితో కలిపి రసాన్ని తీయాలి. ఆ తరువాత దానికి నిమ్మరసాన్ని కలిపి పాము, తేలు వంటి విష కీటకాలు కుట్టిన చోట రాయాలి. ఇలా రాయడం వల్ల విష ప్రభావం తగ్గుతుంది. ముళ్లవంగ మొక్కను మొత్తం నీటిలో వేసి కరిగించాలి. ఈ నీటిని నోట్లో పోసుకొని పుక్కిలించి ఉమ్మవేయడం వల్ల దంత సమస్యలు తొలిగిపోతాయి. అలాగే ఈ మొక్క వేరును ఎండబెట్టి దానిని పొడి చేసుకోవాలి. ఆ పొడిని రోజూ గ్లాసు నీటిలో కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.

Leave a Comment