బెల్లంముక్క, కొబ్బరి చెక్క.. కలిపి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం మాత్రమే చేయనక్కర్లేదు. కొన్ని ఇతర పదార్థాల మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక శక్తి వస్తుంది. మనకు ఇంట్లో రోజూ కనిపించే పదార్థాల మిశ్రమంతో అనేక ప్రోటీన్లు లభిస్తాయి. ఇంట్లో ఎప్పుడూ దొరికే కొబ్బరి ముక్క, బెల్లం కలిపి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. కానీ వీటిని కలిపి తినేంత టైం కూడా లేదు కొందరికి. వీటి మిశ్రమం చేసి తినడం ఎలాంటి ప్రొటీన్లు అందుతాయో తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు. ఆలయాలకు వెళ్లినప్పుడు ఇంట్లో పూజ జరిగినప్పుడు కొబ్బరి అందుబాటులో ఉంటుంది. బెల్లం ప్రతీ కిరాణా షాపులో దొరుకుతుంది. దీంతో కొబ్బరిని వెంటనే బెల్లంకలుపుకొని తినేయాలి. అయితే బెల్లం, కొబ్బరి కలిపి తింటే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం..

కొబ్బరి, బెల్లం రెండూ ప్రొటీన్లు కలిగిన పదార్థాలే. ఈ రెండింటిలో మెగ్నిషీయం ఉంటుంది. ఇవి శరీర నిర్మాణానికి, కండరాల పనితీరుకు ఎంతగానో ఉపయోగపడుతాయి. ఎదిగే పిల్లలకు ఈ మిశ్రమం ఇవ్వడం వల్ల వారికి ఎక్కువ శక్తి ఇచ్చినట్లవుతుంది. వీలైతే ప్రతీరోజు దీనిని తీసుకోవడం వల్ల పిల్లలు చురుగ్గా ఉంటారు. బద్ధకం నుంచి యాక్టివ్ గా మారి చదువులోనూ రాణిస్తారు. కొబ్బరి, బెల్లం కలిపి తింటే మనసు ప్రశాంతంగా మారుతుంది. దీంతో ఒత్తిడి దూరమై నిద్ర చక్కడా పడుతుంది. అంతేకాకుండా వీటిలో ఐరన్ కూడా ఎక్కువగా ఉండడంతో రక్త హీనత సమస్య నుంచి బయటపడవచ్చు.

మిగతా పదార్థాల్లో లాగే కొబ్బరిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాల్షియం ఎముకలను ధృఢంగా చేస్తుంది. అలాగే కొబ్బరిని నోట్లో వేసుకొని నమలడం వల్ల దంత సమస్యలు కూడా దూరమవుతాయి. రోగ నిరోధక శక్తి పెరిగి ఇతర వ్యాధులను దరిచేరనీయవు. ఇక బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీంతో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఫలితంగా సీజనల్ వ్యాధుల నుంచి కూడా తప్పించుకోవచ్చు.

తీవ్రమైన తలనొప్పితో బాధపడేవారు కొబ్బరి, బెల్లం మంచి ఔషధంగా పనిచేస్తుంది. తలనొప్పి వచ్చిన వారు అందుబాటులో ఈ మిశ్రమం ఉంటే తినేయండి. వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇక గర్భిణులు కూడా దీనిని తీసుకోవచ్చు అని అంటుంటారు. కానీ వైద్యుల సమక్షంలోనే తీసుకోవాలి. గర్భిణులు ఈ మిశ్రమాన్ని తినడం వల్ల పుట్టే పిల్లల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి లోపాలు లేకుండా బిడ్డ జన్మిస్తాడు.

Leave a Comment