దొండకాల వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయా..?

కాలమేదైనా మార్కెట్లో అందుబాటులో ఉండే కూరగాయల్లో దొండకాయ ఒకటి. దొండకాయ తినడం వల్ల పిల్లల్లో మందబుద్ధి వస్తుందని కొందరి అపోహ. కానీ ఈ వెజిటెబుల్ చేసే మేలు గురించి తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు. దొండకాయలో శరీరానికి అవసరయ్యే అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఆయుర్వేద మందుల్లో దొండకాయను వాడుతారు. ప్రాచీన కాలం నుంచి దొండకాయను ప్రత్యేక వంటకంగా భావిస్తున్నారు. అయితే దొండకాయ ఎలాంటి రోగాలు రాకుండా అడ్డుకుంటుంంది..? ఇందులో లభించే పోషకాలేంటి..?

దొండకాయ తినడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు దరి చేరవు. పలు రకాల క్యాన్సర్ల బారిన పడే అవకాశాలు తక్కువేనని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే నోటిపూత, పెదవులు పగుల్లు, వంటి సమస్యలు దీని ద్వారా నయమవుతాయి. మానసిక ఒత్తిడి నుంచి దూరం కావడానికి దొండకా దివ్యౌషధంలా పనిచేస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థ సమస్య ఉన్నవారికి ఈ కాయ ఎంతో మధురంలా ఉంటుంది. దీనిని కూరగానే కాకుండా పచ్చిగా తిన్నా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

దొండకాయల్లో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులో బి1, బి2, బి3, బి6, బి9, సి వంటి విటమిన్లు ఉంటాయి. అలాగే బీటా కెరోటిన్, కాల్షియం, మెగ్నిషియం వంటి పోషకాలు లభిస్తాయి పిల్లలకు తరుచూ ఇవ్వడం వల్ల వారి మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రక్త హీనత సమస్య కూడా దరిచేరదు. దొండచెట్టు ఆకులను మెత్తగా నూరి తలపై ఆ పసరును రాస్తే మంచి ఫలితం ఉంటుంది. గజ్జి, తామర, అలర్జీ వంటి చర్మ వ్యాధులతో బధపడేవారు దీనికి ఎక్కువగా తీసుకోవాలని వైద్య నిపుణులు అంటున్నారు.

వీటిని తినడం వల్ల ఎముకల్లో ధృఢత్వం పెరుగుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు కరగాలంటే దొండకాయ తినుమని వైద్యులే చెబుతున్నారు. మార్కెట్లో ఎక్కువగా అందుబాటులో ఉంటే దొండకాయను తెచ్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే ఇవి మానసిక రుగ్మతల నుంచి కాపాడుతాయి. ఎలాంటి మానసిక సమస్యనైనా లేకుండ చేస్తుంది. ఇక జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగాలంటే దొండ కాయలను కచ్చితంగా తినాలి.

Leave a Comment