కమెడియన్ సునీల్ భార్య ఏం చేస్తారో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్లకు హీరోతో సమానంగా క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది హీరోలు ఒకప్పుడు కామెడీ చేసిన వాళ్లే. అయితే హీరోగా రాణించని వారు తిరిగి కమెడియన్ గా కొనసాగుతున్నారు. అయితే సునీల్ మాత్రం ప్రత్యేకంగా నిలుస్తున్నారు. కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత హీరోగా మారారు. హీరోగా రాణించకపోవడంతో విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో నటిస్తున్నారు. కమెడియన్లలో సునీల్ నటన భిన్నంగా ఉంటుంది. నేటి తరానికి తగ్గట్లుగా కామెడీ చేస్తూ యూత్ ను బాగా ఆకట్టుకుంటాడు. సినిమాల్లో అందరినీ నవ్వించే సునీల్ ఫ్యామిలీ బ్యాక్రౌండ్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే..?

‘చిత్రం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పరిచయం అయిన సునీల్ ఆ తరువాత స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రముఖ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అండతో పలు సినిమాల్లోనటించిన తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటికే ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న బ్రహ్మానందం, ఆలీలకు సునీల్ గట్టి పోటీ ఇచ్చారు. అయితే ఆ తరువాత ఆయనకు హీరోగా అవకాశం రావడంత కమెడియన్ గా నటించడం ఆపేశారు.

‘అందాల రాముడు’ సినిమలో సునీల్ మొదటిసారిగా హీరోగా కనిపించారు. ఇందులో ఆర్తి అగర్వాల్ హీరోయిన్. కథ, ఎమోషనల్ తెప్పించే ఈ సినిమా విజయవంతం కావడంతో సునీల్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇదే ఊపుతో రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వచ్చి ‘మర్యాద రామన్న’ సినిమా చేశారు. ఆ తరువాత పూలరంగడు, ఉంగరాల రాంబాబు వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించారు. అయితే హీరోగా అవకాశాలు తక్కువ కావడంతో సునీల్ యూటర్న్ తీసుకున్నాడు. తిరిగి కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు. రీసెంట్ గా అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’లో విలన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 

Leave a Comment