‘చందమామ’ హీరోయిన్ ఇలా మారిపోతుందని ఎవరూ అనుకోరు..

సినిమాల్లో కొంతకాలం హవా సాగించిన వారు ఆ తరువాత పెళ్లిళ్లు చేసుకొని సెటిలైపోయారు. కొందరు పెళ్లి తరువాత కూడా ఏదో రకంగా వెండితెరపై కనిపిస్తున్నారు. కానీ ఇంకొందరు ఫ్యామిలీ జీవితానికే పరిమితం అయిపోయారు. స్టార్ హీరోయిన్ రేంజ్ లోకాకపోయినా తన అందచందాలతో ఆకట్టుకున్ సింధు మీనన్ ను ఎవరూ మరిచిపోరు. అమె నటించింది కొన్ని సినిమాలే అయినా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సింధు తెలుగులో నటించిన ‘భద్రాచలం’, ‘చందమామ’ సినిమాలు ఇప్పటికీ గుర్తొస్తాయి. ప్రస్తుతం సింధు మీనన్ తెలుగు సినిమాల్లో కనిపించకపోయినా ఇతర ఇండస్ట్రీ టీవీ షోల్లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇంతకీ ఆమె ప్రస్తుతం ఎలా ఉన్నారో చూద్దాం…

అందరిలాగే సింధు మీనన్ చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1994లో కన్నడ చిత్రం రశ్మి అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు. ఆ తరువాత 1999లో ‘ప్రేమప్రేమప్రేమ’ అనే సినిమాలోనూ నటించారు. అయితే ఆ రెండు ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న సింధు.. తెలుగులో మాత్రం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. రియల్ స్టార్ శ్రీహరి నటించిన ‘భద్రాచలం’ సినిమాలో సింధు హీరోయిన్ అన్న విషయం తెలిసింది. మొదటి సినిమాతోనే ఆమెకు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దీంతో అవకాశాలు వెల్లువలా వచ్చాయి.

‘త్రినేత్రం’, ‘శ్రీరామచంద్రులు’‘చందమామ’ తదితర సినిమాలో సింధు నటించారు. ‘చందమామ’ సినిమా సక్సెస్ కావడంతో సింధు మీనన్ కు కూడా గుర్తింపు వచ్చింది. అయితే కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఆమె ఆ తరువాత సైడ్ హీరోయిన్ గానే నటించాల్సి వచ్చింది. ‘త్రినేత్రం’లో సింధు నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. స్టార్ హీరోయిన్ రేంజ్ లో దూసుకెళ్లకపోయినా ఈమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

మిగతా హీరోయిన్ల లాగే సింధు కూడా పెళ్లయిన తరువాత జీవితం మారిపోయింది. 2010లో డిమినిక్ ప్రభు అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తరువాత సినిమాల్లో కనిపించడం తగ్గింది. ప్రస్తుతం సింధు దంపతులకు ఓ పాప, బాబు ఉన్నారు. సినిమాల్లో నటించకపోయిన ఓ డ్యాన్స్ షో కు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే సింధు మీనన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలను షేర్ చూస్తూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలను చూసి సినీ ప్రేక్సకులను షాక్ అవుతున్నారు. అప్పటి సింధుకు ఇప్పటి సింధుకు చాలా తేడా ఉందని కామెంట్లు పెడుతున్నారు.

Leave a Comment