చేతిలో X ఆకారం ఉంటే ఏమవుతుంది..? లాభమా..? నష్టమా..?

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొందరు చేతి రేఖలు చూసి జాతకం చెబుతారు. వీరు చెప్పే మాటలను కొందరు నమ్ముతారు. కానీ మరికొందరు పట్టించుకోరు. అయితే చేతిలో ఉన్న రేఖలు మనిషి జీవితానికి భవిష్యత్ ను నిర్దేశిస్తాయని, దీనివల్ల జరగబోయే ఆపదలను ముందే తెలుసుకొని జాగ్రత్తగా ఉండొచ్చని అంటారు. వారు చెబుతున్న ప్రకారం.. చేతిలో X అనే ఆకారం ఉన్నవారి జీవితం మిగతా వారి కంటే ప్రత్యేకంగా ఉంటుందట. అలెగ్జాండర్, అబ్రహం లింకన్, వ్లాదిమిర్ పుతిన్ లాంటి గొప్పవాళ్ల చేతిలో ఇలాంటి ఆకారం ఉందని కొందరు అంటున్నారు. ఇంతకీ చేతిలో X ఆకారంల ఉంటే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం..

మన అరచేతిల్లో రకరకాల గీతలు ఉంటాయి. ఇవి మనిషి జీవితానికి సంబంధించినవి కొందరు అంటారు. కానీ కొందరు మాత్రం బిడ్డ పుట్టే సమయంలో ఎలాంటి ఆకారంలో చేతిని ముడుచుకొని ఉంటుందో ఆ ప్రకారంగా ఈ గీతలు ఏర్పడుతాయని అంటారు. అంతేకాగా ఏ మనిషి జీవితం చేతి గీతల్లో ఉండదని వాదిస్తున్నారు. కానీ జ్యోతిష్యులు మాత్రం ఈ విషయంలో చాలా పరిశోధనలు జరిగాయని, అసలు విషయాలు నిర్దారించుకున్న తరువాతే జాతకం చెప్పబడుతుందని అంటున్నారు. అయితే చేతిలో X ఆకారం ఉంటే మాత్రం అద్భుతాలే జరుగుతాయని అంటున్నారు.

చేతిలో X ఆకారం ఉన్న వాళ్లు ఒకరకంగా అదృష్టవంతులనే చెప్పాలి. వీరు ఏ ప్రణాళిక లేకుండా విజయాలు సొంతం చేసుకుంటారు. ప్రతీ విషయాన్ని విజయపథంలో ముందుకు తీసుకెళ్లగలుగుతారు. కొన్ని సార్లు అనుకోని విజయాలు తమ జీవితంలోకి వస్తాయి. ఇక ఎదుటివారిని అంచనా వేసే శక్తి వీరికి ఉంటుంది. దీంతో వారిని మోసం చేయడానికి అస్సలు వీలు పడదు. శారీరకంగా, మానసికంగా ధృఢంగా ఉంటారు కాబట్టి.. వీరి దగ్గరికి అంటురోగాలు సైతం దరిచేరవంటున్నారు.

వీరు చేసే పనుల వల్ల తమ జీవితాన్నే కాకుండా ఇతరుల జీవితాల్లో కూడా మార్పును తీసుకురాగలరు. వీరు ఆశించిన ఫలితాల కంటే ఎక్కువే ప్రయోజనం పొందుతారు. విజయం కోసం వీరు పరుగెత్తకపోయినా ఆ విజయం వీరికి సొంతం అవుతుంది. గొప్పగొప్ప వాళ్ల చేతిలో మాత్రం X ఆకారం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

Leave a Comment