‘అమ్మోరు’ చైల్డ్ ఆర్టిస్టు ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

తెలుగు సినిమాల్లో సోషియో ఫాంటసీ సినిమాలు దాదాపుగా సక్సెస్ అయ్యాయి. ఇవి కోడిరామకృష్ణ డైరెక్షన్లోనే ఎక్కువగా వచ్చేవి. 1995లో వచ్చిన అమ్మోరు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తే చూడని మహిళా ప్రేక్షకులు ఉండరు. సౌందర్య, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలుగా నటించిన ఇందులో సురేశ్ హీరోగా నటించారు. అయితే ఇందులో చెప్పుకోదగ్గ మరో పేరు చిన్నారి అమ్మోరు. ఓ చిన్నారి అమ్మోరు రూపంలో వస్తూ సౌందర్యను కాపాడుతూ ఉంటుంది. ఈ పాత్రలో నటించిన అమ్మాయి పేరు సునయన. ఆ సమయంలో చిన్నారిగా ఉన్న సునయన ప్రస్తుతం ఏం చేస్తుందో తెలుసా..?

కోడిరామకృష్ణ డైరెక్షన్లో దాదాపు సోషయో ఫాంటసీ సినిమాలే ఎక్కువగా ఉంటాయి. ఆయన కెరీర్లో అమ్మోరు సినిమా హైలెట్ గా నిలుస్తుంది. గ్రామదేవతకు ఎంత పవర్ ఉంటుందో ఈ సినిమా ద్వారా చూపించారు. భక్తురాలిగా సౌందర్య నటన ఆకట్టుకుంటుంది. దేవత పాత్రలో రమ్యకృష్ణ జీవించింది. ఇందులో సౌందర్య, రమ్యకృష్ణలకు ధీటుగా సునయన నటించింది. చిన్న వయసులోనే దేవతగా ఆమె చేసిన యాక్టింగ్ కు విమర్శల నుంచి ప్రశంసలు వచ్చాయి.

సునయన చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన తరువాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. స్టడీస్ పైనే ఆమె కెరీర్ ను ఫోకస్ పెట్టారు. అయితే ఆ తరువాత సినీ ఇండస్ట్రీలో ఉన్న పోటీ కారణంగా ఈమె హీరోయిన్ గా రాణించలేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించేందుకు రెడీ అయ్యారు. ఈ తరుణంలో ‘ఓ బేబీ’ సినిమాలో సునయనకు అవకాశం వచ్చింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్ కూతురిగా సునయన నటించారు. అమ్మోరు సినిమాలో గంభీరమైన పాత్రలో నటించిన సునయన ఓబేబీలో లేడీ కమెడియన్ పాత్రలో నటించి మెప్పించారు.

‘ఓ బేబీ’ సినిమా యావరేజ్ సక్సెస్ సాధించినా సునయన ను మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆమె ఇక సినిమాల వైపు చూడలేదు. ఆ తరువాత ఓ సాప్ట్ వేర్ ఉద్యోగిని పెళ్లి చేసుకుంది. వీరిక ప్రస్తుతం ఓ పాప ఉంది. అయితే సునయన మాత్రం ఖాళీగ లేదు. ‘ప్రెస్టేటేడ్ ఉమెన్’ పేరుతో ఓ యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తోంది. ఈ చానెల్ లో సునయన వ్యాఖ్యతగా ఉంటారు. సినీ ఇండస్ట్రీలో ఇప్పుడున్న పోటీ కారణంగా హీరోయిన్ కంటే ఇదే బెటరని సనయన చానెలన్ రన్ చేస్తోంది.

Leave a Comment