‘విక్రమార్కుడు’ చైల్డ్ ఆర్టిస్టు ఇప్పుడెలా ఉందో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుగా వచ్చిన వారు ఆ తరువాత హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అలనాటి శ్రీదేవి నుంచి నేటి కీర్తి సురేశ్ వరకు చైల్డ్ ఆర్టిస్టుగా రాణించారు. మెగా హీరో అల్లు అర్జున్ కూడా చిన్నప్పుడు సినిమాల్లో నటించారన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. చిరంజీవి నటించిన విజేతలో అల్లుఅర్జున్ అలరిస్తాడు. ఆయనిప్పుడు ఏ రేంజ్ లో ఉన్నారో అందరికీ తెలిసిందే. అయితే చిన్నప్పుడు సినిమాల్లో నటించిన వారందరికీ పెరిగి పెద్దయ్యాక అవకాశాలు రాలేదు. చాలా మంది తమ కెరీర్ పై ఫోకస్ పెట్టడంతో సినిమాల జోలికి రాలేదు. అయితే సోషల్ మీడియా ద్వారా వారి లెటేస్ట్ ఫొటోలను పెడుతూ అలరిస్తున్నారు.

రాజమౌళి, రవితేజ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘విక్రమార్కుడు’. ఇందులో రవితేజకు జోడిగా అనుష్క నటించింది. ఈ సినిమా స్టోరీ అంతా ఓ పాప చుట్టూ తిరుగుతుంది. ద్విపాత్రాభినయంలో నటించిన రవితేజ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. ఆయన కూతురుగా నటించిన ఓ చిన్నారి అలరిస్తుంది. ఆమె పేరు నేహా తోట. నేహ తోట విక్రమార్కుడు సినిమా తరువాత ‘రక్ష’ సినిమాలో నటించింది. ఇందులో దెయ్యం పాత్రలో అమె నటన పలువురిని ఆకట్టుకుంటుంది. అయితే ఆ తరువాత కూడా నేహకు చాలా అవకాశాలు వచ్చినా ఆమె తల్లి దండ్రుల మాత్రం ఆమె స్టడీస్ పైనే దృష్టి పెట్టారు.

నేహ తోట ప్రస్తుతం హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. మిగతా హీరోయిన్లకు పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే అమె మళ్లీ సినిమాల్లోకి వస్తుందా..? రాదా..? అనే విషయం మాత్రం చెప్పడం లేదు. కానీ సోషల్ మీడియాలో తనకు సంబంధించిన లెటేస్ట్ ఫోటోస్ ను షేర్ చేయడంతో యూత్ ఫిదా అవుతున్నారు. విక్రమార్కుడు సినిమా చూసిన వాళ్లు ఆమె ఎలా ఉందో చూడాలని తాపత్రయపడుతున్నారు.

ఈ ఫోటోలను చూస్తే నేహ ఇంకా తన స్టడీస్ ను కంటిన్యూ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చదువు పూర్తయిన తరువాతే సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందని కొందరు ఆమె ఫొటోల కింద కామెంట్లు పెడుతున్నారు. చైల్డ్ ఆర్టిస్టుగా వచ్చిన వాళ్లలో కొందరు మాత్రమే పెరిగిపెద్దయ్యాక రాణించారు. ఆ తరువాత ఇతర రంగాల్లో స్థిరపడ్డారు. మరి నేహ తిరిగి సినిమాల్లో నటిస్తుందా..? లేక వేరే రంగంపైనే ఫోకస్ పెడుతుందా..? అని సినీ ఇండస్ట్రీ లెవల్లో చర్చ సాగుతోంది.

Leave a Comment