ఈ బాలుడి మనోధైర్యాన్ని చూసి.. మెచ్చుకోని వారుండరు..

మానవ జీవితం పూల పాన్పు కాదు. ఎన్నో కష్టాలు, నష్టాలు, ఆనందాలతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. పుట్టెటప్పుడు ఎవరూ బంగారు చెంచా నోట్లో పెట్టుకోరు. కానీ ఈ భూమ్మీద పడ్డాక వారి కష్టార్జితంపైనే జీవితం ఆధారపడి ఉంటుంది. కొంత మందికి ఏ పని చేయకుండానే రాత్రికి రాత్రి కోటీశ్వరులు కావాలని కోరుకుంటారు. కానీ కొందరు మాత్రం కష్టపడితేనే జీవితం అన్న భావన కలిగి ఉంటుంది. ఏదీ ఏమైనా ఓ సినిమాలో రజనీకాంత్ చెప్పినట్లు ‘కష్టపడందీ ఏదీ రాదు.. ఊరికే వచ్చింది ఎప్పటికీ నిలవదు’ అన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే చిన్న చిన్న కష్టానికే పెద్దగా హైరానా పడిపోయే వారు ఈ వీడియో చూడాలని కొందరు అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి..

అందరిలా చదువుకోవడానికి వెళ్లిన ఓ పిల్లాడు.. మిగతా వారిలా మాత్రం లేడు. కొన్ని కారణాల వల్ల తన రెండు చేతులు పొగొట్టుకున్న బుడ్డోడును చూస్తే కన్నీళ్లు ఆగవు. కానీ ఆతడి ఆత్మ స్థైర్యాన్ని చూస్తే మాత్రం రోమాలు నిక్కబొడవడం ఖాయం. ఎందుకంటే రెండు చేతులు లేకున్నా.. ఎవరిమీద ఆధారపడకుండా ఓ స్పూన్ సాయంతో తన ఆకలిని తానే తీర్చుకుంటున్నాడు. మీసాలు తిరిగిన యువకులు సైతం చిన్నపాటి జ్వరానికి ఇతరుల సాయంతో భోజనం చేస్తారు. కానీ పిల్లాడు మాత్రం ఏమాత్రం బాధపడకుండా తన పనిని తానే చేసుకుంటున్నాడు.

సోషల్ మీడియా పుణ్యమాని ఇలాంటి వీడియోలు చాలానే భయటపడుతున్నాయి. కానీ కొందరి సోమరిపోతుల్లో మాత్రం మార్పు రావడం లేదు. కాయ కష్టం చేయకుండా అధికంగా డబ్బు సంపాదించాలని కొందరు కలలు కంటుంటే.. ఏ పనీ చేయకుండా ఇంట్లో కూర్చుునేవారు మరికొంతమంది తయారయ్యారు. ఇక కొందరు మాత్రం చిన్నపాటి సమస్యకే జీవితంలో తమకు తప్ప ఇంకెవరికీ ఇలాంటి కష్టాలు లేవని బాధపడుతారు. అంతేకాకుండా ప్రాణాలు తీసుకునేంత పనిచేస్తారు.

అలాంటి వారికి మోటివేషన్ చేయడానికి మహాత్మగాంధీ లాంటి వారి స్ఫూర్తి అక్కర్లేదు. ఇలా మన చుట్టూ ఎంతో మంది మహనీయుల గురించి తెలుసుకుంటే చాలని కొంత మంది మేధావులు కామెంట్లు పెడుతున్నారు. ఈ పిల్లాడిని చూసి చిన్న పాటి సమస్యలను పెద్దగా చేసేవారు నేర్చుకోవాలని హితువు పలుకుతున్నారు. ఈ పిల్లాడి వివరాలు తెలియవు గానీ ట్విట్టర్లో ఈ వీడియో మాత్రం వైరల్ అవుతోంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఈయన ఆదర్శం అంటూ సపోర్టు చేస్తున్నారు.

Leave a Comment