నాకు 40..తనకు 20..: మేం ఎలా ఉన్నామంటే..?

ప్రపంచంలోని ఏ మూలన ఏం జరిగినా ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఇట్టే తెలిసిపోతుంది. కొందరు సమాజంలో జరిగే సంఘటనల గురించి న్యూస్ షేర్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం తమ పర్సనల్ విషయాలను ఎప్పటికప్పుడు తమ ఫాలోవర్స్ కు తెలుపుతున్నారు. ఇందులో బాగున్నవి వైరల్ గా మారుతున్నారు. తాజాగా ఓ జంటకు సంబంధించిన న్యూస్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఓ వ్యక్తి తన జీవితం గురించి చెప్పిన సత్యాన్ని విని అతడిని చాలా మంది సపోర్టుచేస్తున్నారు. అంతేకాకుండా పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులు కాకుండా.. ఇద్దరి మనసుల మధ్య ముడిపడి ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు.

ఒక వ్యక్తితో మరో వ్యక్తి పెళ్లి అనే కార్యక్రమంతో బంధం ఏర్పడుతుంది. పూర్వ కాలం నుంచి వివాహంలో అనేక నిబంధనలు, ఆచారాలు పాటిస్తున్నారు. అయితే ఆయా కాలాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కొందరు వివాహాల్లో ఉన్న నిబంధనలను మార్చుతూ వస్తున్నారు. ఒకప్పుడు చిన్న పదేళ్లే దాటిన తరువాత అమ్మాయి, అబ్బాయిలకు పెళ్లిళ్లు చేసేవారు. న్నవయసులోనే వారికి పెద్ద బాధ్యతలను అందించేవారు. విజ్ఒనం పెరిగిని కొద్దీ చాలా మందిలో మార్పులు వస్తున్నాయి. పూర్వంలో పెద్దల ఇష్టంతోనే పెళ్లిళ్లు జరగగా.. ప్రస్తుతం వధూ వరుల ఇష్టంతో జరుగుతున్నాయి. అయితే ఆ ఇష్టాల్లో వయసు తేడాలు బాగానే ఉంటున్నాయి.

40 ఏళ్లు ఉన్న ఓ వ్యక్తి 20 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇదంతో మొన్నటి వరకు సినిమాల్లో, వెబ్ సిరీసుల్లో మాత్రమే చూశాం. కానీ రియల్ గా ఈ వయసు ఉన్న ఓ జంట పెళ్లి చేసుకుంది. అంతేకాకుండా తాము అన్యోన్యంగా జీవిస్తున్నామని చెబుతోంది. ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవిస్తూ సంతోషంగా జీవిస్తున్నామని ఆ జంట నెటిజన్లకు సమాధానం ఇస్తుంది. సాధారణంగా అబ్బాయి 25.. అమ్మాయి 21 పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అయితే ఇద్దరి మధ్య కనీసం 4 నుంచి 5 ఏళ్ల గ్యాప్ ఉండాలన్నారు. కానీ ఈ జంట మధ్య 20 ఏళ్ల తేడా ఉంది. అయినా మేం ఎంతో ఆనందంగా ఉన్నామని అంటోంది.

వాస్తవానికి 25-21 వయసు వారు పెళ్లి చేసుకుంటే వారి మధ్య ఇగో ప్రాబ్లమ్స్ వస్తాయని, అప్పుడు జీవితంలో ఎదుగుతున్న వారిలో పంతాలు, పట్టింపులు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఇవి ఒక్కోసారి విడాకుల వరకు దారి తీయొచ్చని ఆ జంట చెబుతోంది. అందువల్ల ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండడం వల్ల ఒకరినొకరు అర్థం చేసుకుంటారని అంటున్నారు. నాకు కావలసిన వంటను తను చేస్తుంది. తనకు కావల్సిన సరుకులన్నీ నేను ఇస్తారు. అయితే వయసు కనపబడకుండా కాస్త వ్యాయామం చేయాల్సిన అవసరం ఉందని జంటలోని పురుషుడు చెప్పాడు.

Leave a Comment