‘మహేశ్ స్థాయికి తగ్గ పనేనా ఇది..’ నేటిజన్ల షాక్

టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేశ్ బాబుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూపర్ స్టార్ కుమారుడిగ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. తండ్రితో కలిసి బాల నటుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన మహేశ్ ఆ తరువాత సూపర్ స్టార్ హీరో అయ్యాడు. ఇటీవల హ్యాట్రిక్ సక్సెస్ సినిమాలు తీసి అభిమానుల్లో జోష్ నింపాడు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో మహేశ్ రేంజ్ గురించి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఈ తరుణంలో మహేశ్ గురించి కొందరు వ్యతిరేకంగా పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. బయటివారు ఇలా పెట్టడం కామన్ అనుకోవచ్చు. కానీ మహేశ్ ఫ్యాన్స్ సైతం ఇలాంటివి పెట్టడంపై పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకమీ మహేశ్ పై విమర్శలు రావడానికి కారణమేంటో తెలుసుకుందాం..

మహేశ్ బాబు సినిమాల్లో వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి కొన్ని కంపెనీలు క్యూ కడుతాయి. తమ యాడ్స్ లో నటించాలని మహేశ్ డేట్స్ కోసం వెంటపడుతాయి. అయితే కొందరి పిల్లలు, అనాథల అవసరాల కోసం యాడ్స్ లో నటించిన డబ్బు కేటాయిస్తానని మహేశ్ పలు సందర్భాల్లో చెప్పాడు. అయితే మహేశ్ ఫ్యాన్స్ మాత్రం యాడ్స్ లో నటించినా గుర్తింపు వచ్చే కంపెనీల్లో కనిపిస్తే బాగుటుంది.. అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గతంలో మహేశ్ ఓ గుట్కా కంపెనీని ప్రమోట్ చేయడంపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం మరోసారి అలాంటి విమర్శలే ఎదుర్కొంటన్నాడు మహేశ్.

ఇటీవల స్టార్ హీరోలంతా టీవీ బాట పడుతున్న విషయం తెలిసిందే. సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్న నేపథ్యంలో కొందరు బుల్లితెరపై ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నారు. సినిమాల్లో ఇచ్చే రెమ్యూనరేషన్ కంటే టీవీల్లో ఎక్కువగా ఇవ్వడంతో పాటు టైం తక్కువగా ఉండడం వారికి కలిసొస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్లు ఇప్పటికే ఎంట్రీ ఇచ్చారు. తాజాగా మహేశ్ ఫొటో కూడా టీవీల్లో కనిపించనుంది.

అయితే మహేశ్ ఏదైనా స్పెషల్ షోలో కనిపిస్తే అట్రాక్షన్ ఉండేది. కానీ ఓ సీరియల్ కోసం ప్రమోట్ చేయడంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. జీ తెలుగులో త్వరలో ప్రసారమయ్యే ‘పడమటి సంధ్యారాగం’ అనే సీరియల్ కోసం మహేశ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే ఆయన బొమ్మలు పెట్టి వైరల్ చేస్తున్నారు. ఇందులో నటించినందుకు రూ.10 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. మహేశ్ నటించడమే కాకుండా ఆమె కూతురు సితార కూడా ఇందులో కనిపిస్తుండడం విశేషం. అయతే ఈ విషయంలో మహేశ్ ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయి కొందరు సపోర్టు చేస్తుండగా..మరికొందరు మాత్రం బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

Leave a Comment