రఘువరన్ కుమారుడు ఇప్పుడెలా ఉన్నాడో చూడండి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా విలన్లకు ప్రాధాన్యతన ఉంటుంది. అందుకే కొందరు హీరోగా అవకాశాలు రాకపోవడంతో విలన్లుగా రాణిస్తున్నారు. గతంలో ఒక సినిమాలో హీరో, హీరోయిన్ గురించి మాత్రమే మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు విలన్ గురించి కూడా చర్చిస్తున్నారు. ఒకప్పుడు విలనిజంకు ప్రత్యేకంగా నిలిచిన రఘువరన్ గురించి తెలియని సినీ ప్రేక్షకుడు లేడు. ఆయన నటనతో సినిమాలకే వన్నె తెచ్చాడు. నాగార్జున హీరోగా వచ్చిన శివ సినిమాలో నటించిన రఘువరన్ తన నటవిశ్వరూపాన్ని చూపించాడు. ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. దురదృష్టవశాత్తూ ఆయన మన మధ్య లేకున్నా.. గుర్తులు మిగిలే ఉన్నాయి. అంతేకాకుండా ఆయన కుమారుడు ఇప్పుడు హీరో రేంజ్ కు మారిపోయాడు.

కేరళకు చెందినరఘువరణ్, నటి రోహిణులు భార్యభర్తలు వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. ఆయన పేరు రిషి వరన్. ఆయన అమెరికాలో ప్రీ మెడ్ డిగ్రీ చదువుతున్నాడు. అచ్చం రఘువరణ్ లాగే ఫేస్ కట్ ఉన్న ఆయనకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో రోహిణి, రిషివరణ్ తో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉన్నారు. వీరి మధ్య రఘువరన్ చిత్రం ఉన్న ఓ పెద్ద సీడి కటౌట్ కనిపిస్తోంది. రఘువరణ్ కు చెందిన ఈ ఆల్బమ్ గురించి రోహిణి ఇలా చెప్పారు.

రఘువరణ్ కు నటనతో పాటు మిగతా కళలు కూడా ఉన్నాయి. ఆయన పాటలు బాగా పాడేవారు. అయితే నటనతో పాటు సింగర్ గా కూడా ట్రై చేయాలని రోహిణి రఘువరన్ ను ఫోర్స్ చేస్తూ ఉండేది. కానీ అందుకు రఘువరన్ ఒప్పుకోలేదట. ఒకేసారి కేటగిరీలపై దృష్టిపెట్టలేని అని చెప్పాడట. అంతేకాకుండా అలా పెట్టటడం కరెక్ట్ కాదని కూడా అన్నాడట. అయితే రఘువరన్ అవకాశాలు తగ్గడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో మద్యానికి బానిస కావడంతో ఆరోగ్యంపై ప్రభావం చూపింది.

ఈక్రమంలో ఆయన కాలేయ వ్యాధితో మరణించారు. ఆయన మరణించే ముందు కొన్ని పాటలు పాడారని, అందుకు సంబంధించినదే ఈ అల్బమ్ అని రోహిణి తెలిపింది. ‘రఘువరన్ ఎ మ్యూజికల్ జర్నీ’ అనే పేరుతో విడుదల చేసిన ఈ అల్బమ్ ను మొదటిసారిగా రజనీకాంత్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అయితే ఈ అల్బమ్ ను మార్కెట్లోకి తీసుకొచ్చే పనులు నిర్వహించేందుకు అమెరికా నుంచి వచ్చాడని రోహిణి పేర్కొంది.

Leave a Comment