యువతుల ఊరమాస్ స్టెప్పులు..వీడియో వైరల్

ఒకప్పుడు పెళ్లి ఊరేగింపులో అబ్బాయిలు బారాత్ చేసేవారు. వీరు చేస్తుంటే అమ్మాయిలు వారి డ్యాన్స్ చూస్తుండేపోయేవారు. కానీ డ్యాన్స్ చేయడానికి ఇష్టపడేవారు కాదు. కానీ సాంకేతిక యుగంలో అమ్మాయలు టూ ఫాస్ట్ గా మారిపోయారు. ఎక్కడ చిన్న ఫంక్షన్ జరిగినా చిందులేస్తున్నారు. పెళ్లిళ్లు, జాతర్లు ఇలా ఎటువంటి ఊరేగింపులైనా అమ్మాయిలే ముందుగా డ్యాన్స్ చేస్తున్నారు. అయితే మొన్నటి వరకు వరకే కేవలం సాధారణ డ్యాన్స్ లు మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు ఊరమాస్ స్టెప్పులు వేస్తూ అదరగొడుతున్నారు. ఒక దశలో అబ్బాయిల కంటే ఎక్కువగా వారే దుమ్ము దులుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పెళ్లిళ్లల్లో సాధారణంగా వరుడి స్నేహితులు ఆటపట్టిస్తుంటారు. ఊరగింపులో డ్యాన్స్ లు చేస్తారు. కానీ ఇప్పుడు పెళ్లి వేదికపై వరుడితో పాటు వధువు కూడా స్టెప్పులతో అదరగొడుతోంది. ఇటీవల ఓ వధువు చేసిన డ్యాన్స్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ప్రతీ వధువు ఎంతో కొంత డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. పెళ్లి సంప్రదాయంలో ఇది కూడా ఒక భాగం కావడం విశేషం. ఇక మరికొన్ని పెళ్లిళ్లలో మాత్రం వీరితో పాటు బంధువులు చిందులు వేస్తూ అదరగొడుతున్నారు. ఇలా మాములు డ్యాన్స్ లు కాకుండా ఊర మాస్ స్టెప్పులు వేసి ఆకట్టుకుంటున్నారు.

కొంత మంది యువతులు డ్యాన్స్ చేసే అవకాశం ఎప్పుడు వస్తుందా..? అన్నట్లు ఎదురుచూస్తున్నారు. చాన్స్ వస్తే చాలు ఇక బ్రేక్ డ్యాన్స్ తో అదరగొడుతున్నారు. డీజే సౌండ్స్ ముందు స్టెప్పులు వేసేందుకు అబ్బాయిల కంటే వారే ముందుంటున్నారు. వారు డ్యాన్స్ చేయడమే కాకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. చాలా మంది నెటిజన్లు ఇలాంటి డ్యాన్స్ లకు లైక్ లు కొడుతూ వాటిని వైరల్ చేస్తున్నారు.

తాజాగా ఓ వీడియో కూడా అలాగే వైరల్ అవుతోంది. కొందరు యువతులు వెనకాముందు చూసుకోకుండ పూనకాల డ్యాన్స్ చేసి అదరగొట్టారు. బ్రేక్ డ్యాన్స్ కు ఏమాత్రం తగ్గేదేలే అనుకుంటూ స్టెప్పులు వేశారు. మరికొందరు మాత్రం చూడీదార్లోనూ ఇరగదీసే స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. ఓ పెళ్లిలో వారు చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది. చాలా మంది నెటిజన్లు వీరి డ్యాన్స్ ను చూసి ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా రకరకాల కామెంట్లు పెట్టి ఆకట్టుకుంటున్నారు.

Leave a Comment