హీరో నానికి థ్యాంక్స్ చెప్పిన టీడీపీ నేత.

హీరో నాని థియెటర్స్ పై ఎపి ప్రభుత్వం చెస్తున్న దాడిని బయట పెట్టిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.ఏపీ మంత్రులు.. హీరో నానిపై కౌంటర్‌ ఎటాక్ చేస్తుంటే.. టీడీపీ మహిళా నేత అనిత మాత్రం ఆయనకు మద్దతు గా నిలిచారు.. టిక్కెట్‌ ధరలపై హీరో నాని కామెంట్లపై స్పందించిన అనిత. హీరో నానికి థాంక్స్‌ చెబుతున్నాను.. సినీ ఇండస్ట్రీలో వాళ్లకి ఇప్పటికైనా నొప్పి తెలిసిందని వ్యాఖ్యానించారు.

రెండున్నరేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న విధానాలపై సినీ ఇండస్ట్రీ స్పందించలేదన్న అనిత.. ఈ ప్రభుత్వ విధానాలతో మాకు సంబంధం లేదనుకున్నారో.. భయపడ్డారో.. కానీ, సినిమా వాళ్లు స్పందించలేదని.. సినీ ఇండస్ట్రీకి ఇప్పుడు సెగ తాకింది. నానికి అందరు మద్దతు ఇవ్వండి అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు.హీరో నానితో పాటు.. మిగిలిన వారు కూడా సినీ ఇండస్ట్రీ సమస్యల మీదే కాకుండా ఇతర సమస్యలపై స్పందించాలని కోరారు.. సినీ ఇండస్ట్రీ మీద ఆధారపడి చాలా మంది బతుకుతున్నారు కదా..? ప్రభుత్వం తీరును నాని తప్పుపట్టారని.. వైసీపీ విమర్శిస్తోందని మండిపడ్డారు. మొత్తానికి ఈ రగడ ఎంత వరకూ పోతుందో చూడాలి.

Leave a Comment