బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య..నిజమా?

ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 5 పూర్తి చేసుకుంది. ఇప్పుడు సీజన్ 6 కోసం సెలెబ్రిటీల వేట మొదలు పెట్టింది. అయితే ఈసారి హోస్ట్ మారే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. లెజెండ్ బాలయ్య ఈ షొలొ సందడి చెస్తాడనె టాక్..ఇక్కడ కూడా ఓటీటీ సీజన్ మొదలవుతుందని మెయిన్ ఆరవ సీజన్ మాత్రం వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత ఉంటుందని చెప్పుకుంటున్నారు. రెండు నెలలో మొదలయ్యేది ఏ సీజన్ అన్నది పక్కన పెడితే ఈసారి హోస్ట్ ఎవరన్న దానిపై కూడా క్రేజీ ప్రచారం జరిగిపోతుంది.

ఈసారి బిగ్ బాస్ హోస్ట్ గా నందమూరి బాలకృష్ణ అదరగొట్టనున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.తొలి రెండు సీజన్లు ఎన్టీఆర్, నానీ చేస్తే మూడు నుండి ఐదవ సీజన్ వరకు నాగ్ చేశాడు. అయితే, ఈసారి హోస్ట్ మార్చాలని నిర్వాహకులు భావిస్తుండగా బాలయ్య అయితే షోకు మంచి జోష్ ను తీసుకు వస్తాడని వినిపిస్తుంది.. మరి ఎలా ఉంటుందో షో చూడాలి..

Leave a Comment