వామ్మో.. పిల్లలు కన్న మగాడు.. ఎక్కడో తెలుసా..?

మాతృత్వం అనేది ఆడవారికే ఉంటుంది అది ఒకప్పుడు మాట. కానీ ఇప్పుడు మాత్రం కాదు.లాస్ ఏంజిలిస్‌కు చెందిన బెన్నెట్ కాస్పర్ ఇదే చెబుతున్నాడు. అతడు గత అక్టోబర్‌లో ఓ పడంటి బిడ్డకు జన్మనిచ్చాడు. తన గర్భంలో బిడ్డను తొమ్మిది నెలల పాటు మోసి కన్నాడు. బిడ్డను చూసి అతడి భర్త కూడా మురిసిపోయాడు. కానీ..ఆస్పత్రిలోని నర్సుల తీరుతోనే కాస్పర్ విసిగిపోయాడు.

తనను మాటమాటికీ ‘అమ్మ’ అని వారు సంబోధిస్తుండటం పట్ల అతడు తీవ్ర ఆగ్రహానికి గురైయ్యారు.. తాను మగాడిని అని చెప్పుకొలెకపోయాడు.పుట్టుకతో మహిళ అయిన బెన్నెట్ 2011లో తాను ట్రాన్స్‌జెండర్ అన్న నిర్ధారణకు వచ్చాడు. ఈ క్రమంలో అతడు శస్త్రచికిత్స ద్వారా తన వక్షోజాలను తొలగించుకున్నాడు. హార్మోన్ చికిత్స ద్వారా కొన్ని పురుష లక్షణాలను సంతరించుకున్నాడు. అన్నీ తీసాడు కానీ గర్భసంచిని తొలగించలేదు..దానివల్ల పిల్లలను కన్నాడు

Leave a Comment