రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అపశృతి..

యంగ్ హీరో రెబల్ స్టార్ తాజాగా నటించిన చిత్రం రాధే శ్యామ్.. జిల్ ఫెమ్ రాధాకృష్ణ దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కింది. మరి కొద్ది రోజుల్లొ విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గురువారం నిర్వహించారు..రామోజీ ఫిలింసిటీ అందుకు వేదిక అయ్యింది. గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించారు..

అయితే ఈ ఈవెంట్ లో ఉద్రిక్తత వాతవరణం నెలకొంది.కృష్ణంరాజు కటౌట్ పైకి అభిమానులు ఎక్కి హంగామా సృష్టించారు. ఆ సమయంలో కటౌట్ కింద పడడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. మరోవైపు అభిమానులను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. భారీ అంచనాలతో సినిమా జనవరి 14 న విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీ గా విడుదల అవుతుంది.

Leave a Comment