ట్రిపుల్ ఆర్ మూవీకి మరో షాక్..

రాజమౌలి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ట్రిపుల్ ఆర్.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రలలొ నటిస్తున్నారు. ఇప్పటికీ షూటింగ్ పూర్తి చెసుకున్న చిత్రం ప్రమోషన్స్ లో బిజిగా వుంది.. పాన్ ఇండియా మూవిగా సంక్రాంతి కి విడుదల కానుంది.సినిమా నుంచి విడుదలైన టీజర్ లకు పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై మరింత అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా దాదాపు 14 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న విడుదల కానుంది. రాజమౌళి ఈ సినిమాను 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కబోతోంది.ఆర్ఆర్ఆర్ మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి వల్ల థియేటర్స్ మూతబడిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాలలొ లాక్ డౌన్ ను విధించారు. మరి జక్కన్న ఎం చెస్తారొ చూడాలి.

Leave a Comment