అయ్యయ్యో వర్మ..నీకు ఎందుకయ్యా..

టాలివుడ్ లో సినిమాలు విడుదల  అవుతున్నాయి. అయితే ఆ సినిమా లపై వర్మ  కామెంట్లు చేయడం చూస్తూనే ఉంటాము. ఇప్పుడు మరోసారి వర్మ వార్తల్లొ నిలిచాడు. సంక్రాంతి బరిలో ట్రిపుల్ ఆర్ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆర్జివి గొప్ప ఆలోచన చేశాడు..అది కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది..

వర్మ ప్రభుత్వానికి అద్భుతమైన ఐడియా ఇచ్చాడు. ట్వీట్టర్ వేదికగా.. ఓమిక్రాన్ గురించి ప్రభుత్వానికి కావాల్సిన గొప్ప ఐడియా తన వద్ద ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయినప్పుడు డబుల్ డోస్ తీసుకున్న వారిని మాత్రమే థీయేటర్స్ లకు అనుమతి ఇవ్వాలి. ఆర్ఆర్ఆర్ సినిమా చూడాలనే ఉద్ధేశంతో అయినా.. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకుంటారు. అని అన్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఉన్న క్రేజ్ తో అభిమానులు నిజాంగానే రెండు డోసులు వేసుకుంటారని పలువురు కామెంట్ చేస్తున్నారు.. చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Leave a Comment