ఏపి లో మరో 30 థియెటర్స్ మూసివేత..

ఏపి లో సినిమా టిక్కెట్ ధర తగ్గింపు పై చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటి వరకూ వున్న రేట్ల తో లాభం లేదని సినిమా హాల్ యాజమాన్యం హాల్లను మూసి వేస్తున్నారు.ఆంధ్రాలో శుక్రవారం 30 హాళ్లు సీజ్ అయినట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ, పోలీసు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో ఇప్పటికే పలు పలుచోట్ల థియేటర్లను సీజ్ చేశారు. మరోవైపు టికెట్ల ధరలు అతి తక్కువగా ఉన్నందున థియేటర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు కొన్ని చోట్ల బోర్డులు పెడుతున్నారు.

ఇది ఇలా ఉండగా.. మరోవైపు సినిమా థియేటర్ల తనిఖీలు పరంపర కొనసాగుతుంది.నిబంధనలు అమలు చేయడం లేదన్న కారణాలతో శుక్రవారం రోజున పలు చోట్ల థియేటర్లు సీజ్ చేశారు. లోపాలపై థియేటర్ల యజమానులకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే పలు జిల్లాలోని హాల్స్ ను మూసివేసారు.ఇలానే కొనసాగితే మాత్రం ఇప్పుడు విడుదల అవుతున్న సినిమాలకు భారీ నష్టాలు తప్పవు..

Leave a Comment