మొలకెత్తిన గింజలు కొవ్వును కరిగిస్తాయా..?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని మీద బిజీగా ఉంటున్నారు. ఉద్యోగం, వ్యాపారం చేసేవారే కాకుండా ఇంట్లో ఉండే మహిళలు కూడా వంట పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో అనారోగ్యం బారిన పడిన వారు వైద్యుల వద్దకు వెళితే మెడిసిన్ వాడడంతో పాటు కొన్ని పదార్థాలను తీసుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా మొలకెత్తిన గింజలను తినాలని చాలా మంది వైద్యులు సూచిస్తున్నారు. అయితే మొలకెత్తిన గింజలు రుచిగా ఉండకపోవచ్చు. దీంతో కొంతమంది వాటిని తినడానికి ఇష్టపడరు. కానీ అవి చేసే మేలు తెలిస్తే విడిచిపెట్టరు. ప్రస్తుతం మార్కెట్లో మొలకెత్తిన గింజలను నేరుగా విక్రయిస్తున్నారు. వాటినే కాకుండా మనకు కావాల్సి గింజలను రాత్రంతా నానబెట్టిన తరువాత మొలకెత్తిన తరువాత వాటిని తీసుకోవచ్చు. ఇంతకీ మొలకెత్తిన గింజలు ఎలాంటి ఫలితాలిస్తాయో చూద్దాం..

మొలకెత్తిన గింజలు తినడం వల్ల ఎక్కువగా ఆకలి వేయదు. దీంతో ఎక్కువ పిండి పదార్థాలను తీసుకోవడానికి అవసరం ఉండదు. అంతేకాకుండా ఇవి రోజూ తినే ఆహారంతో సమానంగా కేలరీలు ఇస్తాయి. దీంతో మనిషి శరీర బరువును సమానంగా ఉంచుతూ ఆరోగ్యంగా ఉంచుతుంది. మొలకెత్తిన గింజలను తినడం వల్ల శరీరానికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల తరుచూ ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఈ గింజల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ బి6, ిటమిన్ కెలతో పాటు ఐరన్, పొటాసియం వంటి పోషకాలుంటాయి.

ఈ గింజలను తినడం వల్ల ఫైబర్ అధికంగా వస్తుంది. దీంతో అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇక మొలకెత్తిన గింజల్లో ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో చర్మం, జుట్టు, గోర్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అంతేకాకుండా వీటిని తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను పూర్తిగా తగ్గించుకోవచ్చు. కొలెస్ట్రాల్ తగ్గడానికి ఉపయోగపడుతుండడం వల్ల గుండెకు చాలా మేలవుతుంది.

వీటిని తినడం వల్ల బీపీ, షుగర్ వంటి వ్యాధుల నుంచి కూడా తప్పించుకోవచ్చు. అలాగే చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఈ గింజలను తీసుకుంటే సత్వర ఫలితం ఉంటుంది. క్యాన్సర్ కారకాలతో పోరాడే శక్తి మొలకెత్తిన గింజనలకు ఉంటుంది. గర్భిణులు రోజూ మొలకెత్తిన గింజలను ఆహారంలో తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువుకు పుష్కలంగా పోషకాలు అందుతాయి.

Leave a Comment