నానబెట్టిన కిస్మిస్ తింటే ఇది తప్పకుండా జరుగుతుంది.

మనం రోజూ తీసుకునే ఆహారంతో పాటు కొన్ని ఇతర పదార్థాలు తీసుకోవడం వల్ల మరింత ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ముఖ్యంగ డ్రౌప్రూట్స్ తో తక్షణ ఎనర్జీ వస్తుంది. వీటి ధర కొంచెం ఎక్కువగా ఉన్నా అవి చేసే మేలు కూడా ఎక్కువగానే ఉంటాయి. డ్రైప్రూట్స్ ల కిస్మిస్ (ఎండు ద్రాక్ష)ను మనం ఇంట్లో చేసుకునే పాయసంలో ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇతర స్వీట్ పదార్థాల్లో కూడా వాడుతుంటాం. కానీ వీటిని నేరుగా కూడా తినొచ్చు. నీరసంగా ఉన్నవారు రెండు కిస్మిస్ లను తినడం వల్ల తక్షణ ఎనర్జీ వస్తుంది. అయితే రాత్రంతా నీళ్లలో నానబెట్టిన కిస్మిస్ తినడం వల్ల అనేక ఎక్కువ ప్రయోజనాలున్నాయని అంటున్నారు.

డ్రైఫ్రూట్స్ లో ఇప్పటి వరకు బాదం మాత్రమే నీళ్లలో నానబెట్టి తినాలని తెలుసు. కానీ కిస్మిస్ లు కూడా ఇలా చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. సాధారణంగా తొరికే గ్రీన్ ద్రాక్షను ఎండబెడితే కిస్మిస్ లు తయారవుతాయి. అంటే వాటిలో ఉండే నీరు మొత్తం పోతుంది. మళ్లీ వీటిని నీటిలో నానబెట్టడం వల్ల ఫ్రక్టోజ్, గ్లూకోజ్ అనే పోషకాలు వృద్ధి చెందుతాయి. ఇది పిల్లల్లో బరువును పెంచేలా తోడ్పడుతుంది. గొంతు సంబంధిత వ్యాధులకు కిస్మిస్ మంచి ఔషధం. అలాగే శ్వాస నాళాల్లో పేరుకుపోయిన కపాన్ని తొలగించి దగ్గు వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.

 

ఎండు ద్రాక్షను తరుచూ తీసుకోవడం వల్ల ఎముకలు ధ్రుడంగా మారుతాయి. వీటిలో పీచు పదార్థాలు అధికంగా లభిస్తాయి. దీంతో శరీరానికి ఫైబర్ ఎక్కువగా అందుతుంది. మలబద్దకాన్ని నివారించడంలో ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.అయితే ఎండు ద్రాక్షతో పాటు సోంపు కలిపి తీసుకోవడంతో మలబద్ధకం సమస్య పూర్తినా తగ్గే అవకాశం ఉంది. వీటిని రోజూ రెండు, లేదా మూడు తీసుకోవడంతో శరీరానికి తక్షణ ఎనర్జీ వచ్చి ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది.

ఇక ఎండు ద్రాక్షతో పురుషులకు చాలా ఉపయోగకరం. ముఖ్యంగా అంగస్తంభన సమస్య ఉన్నవాళ్లు వీటిని తీసుకోవడం వల్ల పరిష్కారం కావచ్చు. లైంగిక సామర్థ్యం పెంచుకునేందుకు వీటిని తీసుకుంటూ ఉండాలి. అందువల్ల కేవలం స్వీటు పదార్థాలు చేసినప్పుడే కాకుండా నేరుగా తీసుకోవడంతో ఎన్నో ప్రయోజనాలుంటారు. అయితే వీటిని నేరుగా కంటే నీటిలో నానబెట్టడం వల్ల మరిన్ని పోషకాలు వస్తాయి. కాబట్టి నానబెట్టిన కిస్మిస్ ను తీసుకునేందుకు ప్రయత్నించండి.

Leave a Comment