సుందరకాండ సినిమా హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..

కొందరు నటీమణులు ఒకటి, రెండు సినిమాలతో ఫేమస్ అయ్యారు. కానీ అలాంటి వారు ఎక్కువ కాలం సినిమాల్లో కొనసాగలేకపోయారు. ఇండస్ట్రీని వదిలి ఇతర పనుల్లో నిమగ్నమయ్యారు. మరికొందరు విదేశాల్లో సెటిలయ్యారు. అయితే ఇటీవల అలాంటి వారు తమ లెటేస్ట్ ఫొటోలను నెట్టింట్లో పెడుతూ సందడి చేస్తున్నారు. వెంకటేశ్ కెరీర్లో ది బెస్ట్ మూవీగా నిలిచింది సుందరకాండ. ఈ సినిమాలో మీనాతో పాటు మరో హీరోయిన్ కూడా ఉంటుంది. ఆమె పేరు అపర్ణ. అపర్ణ ఈ సినిమాలో నటించిన తరువాత మళ్లీ సినిమాల్లో కనిపించపలేదు. అయితే ఆమెకు సంబంధించిన లెటేస్ట్ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

కాలేజీ అమ్మాయి లెక్చరర్ ను ప్రేమిస్తుంది. ఇలాంటి కథతో డైరెక్టర్ రాఘవేంద్రరావు సుందరకాండ సినిమాను తెచ్చి అప్పట్లో సంచలనం సృష్టించారు. వాస్తవానికి అపర్ణ ప్లేసులో సీనియర్ హీరోయిన్ కు అవకాశం ఇద్దామనుకున్నారు. కానీ ఆ తరువాత కొత్త అమ్మాయి అయితే బాగుంటుంది అని ఆలోచించారు. ఈ క్రమంలో రాఘవేంద్ర రావు నిర్మాత కెవివి సత్యనారాయణ ను కలిసినప్పుడు ఆయన ఇంట్లో ఒక అమ్మాయి బాగా నచ్చింది. ఆ అమ్మాయిని చూడగానే లెక్చరర్ ను ప్రేమించే అమ్మాయి పాత్రకు షూట్ అవుతుందని అనుకొని ఆమెతో నటించింప జేయాలనుకున్నారు.

అయితే ఆ అమ్మాయి ఎవరు..? ఏంటనే విషయం అడగకుండానే వెంటనే ఆమెకు సినిమా గురించి చెప్పారు. 10 రోజుల తరువాత అసలు విషయం తెలిసింది. ఆమె కెవివి సత్యనారాయణ మేనకోడలు అపర్ణ అని. అప్పటి వరకు ఎలాంటి నటన అనుభవం లేకున్నా.. ఆమెను సినిమాల్లో తీసుకున్నారట. దీంతో మొదటి సినిమాలోనే అపర్ణ అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకుంది. అయితే సినిమాల్లో నటించడానికి అపర్ణ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టలేదు. కానీ చివరిగా అక్క పెత్తనం.. చెల్లెలి కాపురం అనే సినిమాలో నటించింది.

ప్రస్తుతం అపర్ణ అమెరికాలో ఉంటోది. 2002లో వివాహం చేసిన తరువాత ఇండియాను వదిలివెళ్లారు. ఇటీల కొందరు మీడియా సంస్థలు ఆమెను వెతికి పట్టుకున్నారు. టీవీల్లో అపర్ణను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సుందరకాండ సినిమాలో ఉన్న అపర్ణకు ఇప్పటి అపర్ణకు చాలా తేడా ఉంది. ఏమాత్రం గుర్తుపట్టకుండా అపర్ణ మొహం మొత్తం చేంజ్ అయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

Leave a Comment