ఈ చిన్నారి 75 జిల్లాల పేర్లు 38 సెకండ్లలో చెబుతోంది..: వీడియో వైరల్

చిన్నపిల్లలో మెదడు చురుగ్గా పనిచేస్తుందంటారు. ఏదైనా విషయం చెబితే వారు ఇట్టే గుర్తుపెట్టుకుంటారు. అవసరమైనప్పుుడు దాని గురించి చెప్పమంటే చెబుతారు. కానీ ఓ బేబీ మాత్రం ఏకంగా 75 జిల్లాల పేర్లను అవలీలగా చెప్పేస్తుంది. అంతేకాకుండా కేవలం 38 సెకండ్లలోనే ఇలా జిల్లాల పేర్లు చెప్పడం చూసి అందరూ షాక్ తింటున్నారు. కొన్ని విషయాలను విన్నా కూడా గుర్తుంచుకోవడానికి కొందరు చాలా కష్టపడుతూ ఉంటారు.

కానీ ఈ అమ్మాయి మాత్రం ఒక్కసారి ఆ జిల్లాల పేర్లు విని వాటిని బాగా గుర్తు పెట్టుకుంది. అంతేకాకుండా తక్కువ సమయంలో ఇలా చెప్పడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అసలు ఈ చిన్నారి ఎవరు..? ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది..? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.

ఉత్తరప్రదేశ్లోని డియోరియా ప్రాథమిక స్కూల్ లో చదువుతోంది మాన్వి చౌరాసియా. పట్టుమని పదేళ్లు కూడా లేనీ ఈ అమ్మాయి ఇటీవల బాగా ఫేమస్ అయింది. ఏకధాటిగా కేవంల 38 సెకండ్లలోని 75 జిల్లాల పేర్లు టకటకా చెప్పేస్తుంది. ఆమె ఎక్కడో ఈ జిల్లాల పేర్లు విని మెండ్లో పెట్టుకుంది. ఎవరైనా జిల్లాల పేర్లు అడగ్గానే అవలీలగా చెప్పేస్తుంది. ఏమాత్రం బెరుకు లేకుండా ఇలా చెప్పడం చూస్తే ఆమె టాలెంట్ ఉన్న అమ్మాయే అని తెలుస్తోంది.

శుభశంకర్ మిశ్రా అనే వ్యక్తి ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేశారు.అంతేకాకుండా ‘అమేజింగ్ గర్ల్.. ఈ బాలిక నైపుణ్యానికి మీరు సెల్యూట్ చేస్తారు.. ఈ చిన్నారికి మంచి భవిష్యత్ ఉంది అని క్యాప్షన్ పెట్టారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇప్పటి వరకు రెండు లక్షలకు పైగా వ్యూస్ వచ్చిన ఈ వీడియోను చూసిన వారు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇంకనూ ఈ వీడియోకూ వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయి. భవిష్యత్ లో కూడా ఈమె ఎన్నో విజయాలు సాధిస్తుందని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

Leave a Comment