ఈ డెలివరీ బాయ్ ఎలాంటి సాహసం చేశాడో తెలుసా..?: వీడియో వైరల్

మనకు కావాల్సిన వస్తువులను దక్కించుకోవాలంటే అనుకూలమైన సమయం ఉండదు. ఉద్యోగ, వ్యాపార రీత్యా బీజీ లైఫ్ ఉన్న ఈరోజుల్లో కొందరికి కావాల్సిన సేవలను అందించడానికి ప్రత్యేకంగా డెలీవరీ బాయ్స్ రెడీ ఉంటారు. హోటల్ నుంచి ఆహారం, ఇతర వస్తు సేవలను వీరు నిర్వహిస్తారు. అనుకున్న ప్రదేశానికి అనుకున్నసమయానికి వచ్చి కస్టమర్ల మన్ననలు పొందుతారు. ఇన్ టైంలో వస్తువులను అందించినందుకు కొందరు డెలీవరీ బాయ్స్ ను ప్రత్యేకంగా అభినందించిన సంఘటనలూ ఉన్నాయి. అయితే ఈ డెలివరీ క్రమంలో వీళ్లు ఎన్నో కష్టాలు పడుతుంతారు. ఒక్కోసారి వర్షం పడుతున్నా.. ట్రాఫిక్ లో ఇరుక్కున్నా కస్టమర్లకు అనుకున్న విధంగా వస్తువులను అందిస్తారు. ఇలా ఓ కస్టమర్ కు కొన్ని వస్తువులను అందించే క్రమంలో ఓ డెలీవరీ బాయ్స్ తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. ఆ విషయం గురించి తెలుసుకుందాం..

తమిళనాడులో డాంజో అనే కంపెనీ వినియోగదారులకు రకరకాల వస్తువులను అందించడానికి ప్రత్యేకంగా కొందరిని నియమించుకుంది. కస్టమర్లు ఆర్డర్ చేసిన ప్రకారంగా వీరు వారి వస్తువులను అందిస్తూ ఉంటారు. ఎంత సమయం.. ఎక్కడికి రావాలో ముందే తెలుసుకొని ఆ ప్లేసుకు త్వరగా వెళ్లేలా ప్లాన్ వేసుకుంటారు. ఈ విధంగానే ఓ డెలివరీ బాయ్ కస్టమర్ కు వస్తువులను అందించే క్రమంలో పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది. కదులుతున్న రైలును ఛేజ్ చేసి మరీ ఆ వస్తువులను అందించాడు.

ఓ మహిళ కొన్ని వస్తువులను ఆన్లైన్ ఆర్డర్ చేసి.. వాటిని తీసుకురావాలని డాంజో కంపెనీని కోరింది. ఈ కంపెనికి చెందిన ఓ బాయ్ వర్క్ డెడికెషన్ చూపించాడు. రైల్వే స్టేషన్లో ఉన్న ఆ కస్టమర్ కు వస్తువులను అందించడానికి వచ్చాడు. కానీ అప్పటికే ఆ కస్తమర్ రైలు ఎక్కింది. దీంతో కస్టమర్ ను గుర్తించి బాయ్ ఆమె కోసం పరుగులు పెట్టాడు. అలా స్పీడ్ గా పరుగెత్తి మొత్తానికి ఆ మహిళకు కావాల్సిన వస్తువులను అందించాడు.

ఇలా ఆ డెలివరీ బాయ్ పరుగెత్తినప్పుడు కొందరు వీడియో తీశారు. ఆ తరువాత సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ గా మారింది. ఆ డెలీవరీ బాయ్ ను అందరూ ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. అంతేకాకుండా అతనికి ప్రమోషన్ ఇవ్వాలని అంటున్నారు. అంతేకాకుండా సాహసం చేసి మరీ వస్తువులను అందించినందుకు కస్టమర్లు పది రెట్ల టిప్స్ ఇవ్వాలని కోరుతున్నారు.

Leave a Comment