మన్మథుడు హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

అక్కినేని నాగార్జన పక్కన నటించాలని చాలా మంది హీరోయిన్లు అనుకుంటారు. ఒక్కసారి అవకాశం వస్తే తమ లైఫ్ మారుతుందని భావిస్తారు. తాను అనుకోకుండానే నాగార్జున పక్కన నటించే చాన్స్ కోట్టేసింది అన్షు. అన్షు అంటే ఎవరూ గుర్తుపట్టరు. కానీ మన్మథుడు హీరోయిన్ అనగానే చాలా మందికి ఈ భామ గుర్తుకు వస్తుంది. 18 ఏళ్ల కిందట మన్మధుడు, రాఘవేంద్ర సినిమాల్లో నటించిన అన్షు.. ఆ తరువాత సినిమాల్లో నటించలేదు. కానీ ఇటీవల ఆమెకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ మన్మథుడు హీరోయిన్ ఇప్పుడెలా ఉంది..? ఏం చేస్తుంది..?

మన్మథుడు సినిమా అన్షుకు మొదటిదే. కానీ ఈ సినిమాతో ఆమె స్టార్ నటి అయింది. దీంతో ఆమె మిగతా హీరోయన్లకు పోటీ నిస్తుందని అందరూ అనుకున్నారు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన అన్షు రాఘవేంద్ర సినిమా తరువాత మళ్లీ తెలుగులో నటించలేదు. సొంత ఇండస్ట్రీకి వెళ్లి కొన్ని సినిమాల్లో నటించింది. అయితే అవేవీ తనకు పేరు తీసుకురాకపోవడంతో సినిమాలు చేయడం మానుకుంది. దీంతో ఫ్యామిలీ లైఫ్ కే పరిమితం కావాలని భావించింది.

ఈ క్రమంలో లండన్ కు చెందిన సచిన్ అనే వ్యాపార వేత్తను అన్షు పెళ్లి చేసుకుంది. ఆ తరువాత లండన్ కు వెల్లి సెటిల్ అయింది. ఈ దంపతులకు ఓ పాప, బాబు కూడా జన్మించారు. ఇంతకాలం అన్షును ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆమె ఇటీవల కొన్ని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీంతో అన్షు మళ్లీ సినిమాల్లోకి వస్తుందని అందరూ అంటున్నారు. కానీ అన్షు మాత్రం ప్రకటించలేదు.

ప్రస్తుతం అన్షు ఫ్యాషన్ డిజైనర్ గా మారారు. ‘ఇన్స్ఫరేషన్ కౌచర్ అనే షాపు ను రన్ చేస్తున్నారు. సినిమాల్లో కొందరు హీరోయిన్లు వేసుకున్న దుస్తులను రీ డీజైనింగ్ చేసి తన షాప్ లో అమ్ముతున్నట్లు సమాచారం. ప్రస్తతం హ్యాపీ లైఫ్ ను కొనసాగిస్తున్న అన్షు మళ్లీ సినిమాల్లోకి రావాలని చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే సినిమాల కోసం తన షాపును, లండన్ వదిలి ఇక్కడికి వస్తుందా..? అని కొందరు కొశ్చన్ చేస్తున్నారు.

Leave a Comment