రచ్చ చేస్తున్న శ్రీయ బీచ్ అందాల ఫొటోలు..: తల్లయినా.. తగ్గేదేలే..

ఒకప్పుడు బిజీ హీరోయిన్ గా కొనసాగిన శ్రీయ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్లో కొనసాగుతోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. తన పర్సనల్ విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఆకట్టుకుంటోంది. ఇటీవల తనకు పాప పుట్టిన విషయాన్ని కూడా చెప్పిన శ్రీయ ఇప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫొటోస్ తో దర్శనమిస్తోంది. బీచ్ పక్కన అందాలు ఆరబోస్తూ శ్రియ రచ్చ రచ్చ చేసింది. ఓ బిడ్డకు తల్లయినా శ్రీయ అందం ఏమాత్రం తగ్గలేదని కొందరు కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ శ్రీయ ఎలాంటి ఫొటోస్ లో ఉందో చూద్దాం..

తెలుగులో ‘ఇష్టం’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తరువాత అనేక సినిమాల్లో నటించింది. రెండో సినిమాతోనే కింగ్ నాగార్జున పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా ఆమె లైఫ్ కు మలుపుతిప్పింది. ఈ సినిమా తరువాత నుంచి శ్రీయకు విపరీతంగా ఆఫర్లు వచ్చాయి. వెనుదిరిగి చూడకుండా అగ్రహీరోలందరితోనూ నటించి ఆకట్టకుంది. తెలుగులోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలన్నింటిలోనూ శ్రీయ సినిమాలు చేసింది. సౌత్ సూపర్ స్టార్ హీరోయిన్లలో శ్రీయ ఒకరుగా నిలిచి మిగతా హీరోయిన్లకు పోటీ ఇచ్చింది.

సినిమాల్లో అవకాశాలు తగ్గని నేపథ్యంలో శ్రియ ఫ్యామిలీ లైఫ్ కు పరిమితం కావాలని అనుకుంది. ఇందులో భాగంగా రష్యాకు చెందిన ఆండ్రి కొఛీవ్ని అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొన్ని రోజుల పాటు రష్యా వెళ్లిన శ్రీయ ఆ తరువాత తిరిగి ఇండియాకు వచ్చింది. అయితే ప్రతీ విషయాన్ని షేర్ చేసుకున్న ఈ భామ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని మాత్రం ఎవరికీ చెప్పలేదు. తనకు పాప పుట్టిన తరువాత ఆ ఫొటోలను నెట్టింట్లో పెట్టి అందరినీ షాక్ కు గురి చేసింది. ఆ పాపకు రాధ అని పేరు పెట్టడం విశేషమని అభిమానులు అంటున్నారు.

ఇక శ్రీయ ఇటీవల బీచ్ కు వెళ్లారు. అక్కడ హాట్ హాట్ ఫొటోస్ దిగారు. ఓ బిడ్డకు తల్లయినా కుర్ర యువతిలాగా ఫోజులు పెట్టారు. దీంతో శ్రీయ మరోసారి ఇండస్ట్రీకి వస్తున్నారా..? అని కొందరు కామెంట్లు పెట్టారు. అయితే కొన్ని ఫొటోల్లో ఈ అమ్మడు మరీ రెచ్చిపోయారు. బ్యాక్ లెస్ డ్రెస్ వేసి అరాచకం సృష్టించింది. ఈ వయసులో కూడా ఇలాంటి ఫొటోలను షేర్ చేయడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

3.

4.

Shriya Saran New Latest HD Photos | Paisa Vasool Movie Heroine Shriya Saran Photo Shoot Images

Leave a Comment