అనసూయ లెటేస్ట్ డ్యాన్స్ వీడియో వైరల్: ఏం స్టెప్పులు బాబోయ్..

బుల్లితెరపై సందడి చేసే నటుల్లో యాంకర్ అనసూయ ఒకరు. జబర్దస్త్ ప్రొగ్రాం ద్వారా ఫేమస్ అయిన ఈ భామ ఆ తరువాత సినిమాల్లోనూ స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అనసూయ యాంకర్, నటి మాత్రమే కాదు మంచి డ్యాన్స్ అన్న విషయం కూడా తెలుసు. ఎందుకంటే కొన్ని సినిమాల్లోని ప్రత్యేక సాంగ్స్ లో డ్యాన్స్ తో అదరగొట్టింది. ప్రస్తుతం జబర్దస్త్ ను వీడి సినిమాలకే పరిమితమైన ఈ భామకు సంబంధించిన కొన్ని డ్యాన్స్ వీడియోలు ఈమధ్య తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ డ్యాన్స్ వీడియో విశేషాలేందో తెలుసుకుందాం..

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

అందమైన యాంకర్లలో అనసూయ ఒకరు. ఇద్దరు పిల్లలకు తల్లయినా హీరోయిన్ రేంజ్ లో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు సినిమాల్లో విపరీతంగా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల సునీల్ తో కలిసి ‘దర్జా’ సినిమాలో కీలక రోల్ లో కనిపించి ఆకట్టుకుంది. అంతకుముందు పుష్ప సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకుంది. హీరోయిన్ కాకున్నా అంతటి ప్రాధాన్యం గల పాత్రలో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.

అనసూయ సినిమాలో, టీవీ ప్రొగ్రాముల ద్వారా ఎంత బిజీగా ఉన్నా ఇన్ స్ట్రాగ్రాం వేదికలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. ఆమెకు సంబంధించిన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె జబర్దస్త్ యాంకర్ గా ఉన్నప్పుడు చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సగటు హీరోయిన్ కంటే ఎక్కువగా స్టెప్పులు వేసే యాంకర్ డ్యాన్స్ కు యూత్ ఫిదా అవుతుంటారు. అందుకే ఆమె వీడియోలను షేర్ చేసి వైరల్ చేసేస్తున్నారు.

బ్రౌన్ కలర్ లంగావోణిలో అందాలన్నీ ఆరబోసిందా.. అన్నట్లు అనసూయ డ్యాన్స్ చూసి ఫిదా అవుతున్నారు. సినిమాల్లోని ప్రత్యేక సాంగ్స్ లో కంటే అనసూయి ఇలా ప్రొగ్రాముల్లో చేసే డ్యాన్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం సినిమాలతో బిజీగా మారిన అనసూ రాను రాను హీరోయిన్ రేంజ్ లో అవకాశాలు దక్కించుకోవచ్చన అంటున్నారు. ఈ తరుణంలో ఆమెకు ఎలాంటి పాత్రలు కేటాయిస్తారోనన్న చర్చ సాగుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Instant Telugu (@instanttelugu)

Leave a Comment