ఆ సినిమాకు 5 లక్షల మంది నిర్మాతలు..: ఏ సినిమాతో తెలుసా..?

సాధారణంగా ఒక సినిమాను ఒకరు లేదా కొన్ని సంస్థలు కలిసి నిర్మిస్తాయి. మహా అయితే పది మంది వ్యక్తులు కలిసి సినిమాను పూర్తి చేస్తారు. కానీ 5 లక్షల మంది కలిసి ఓ సినిమాను నిర్మించారు. అదీ భారత్ కు చెందిన ఓ సినిమా. పాడి రైతుల కష్టాలను ప్రపంచానికి తెలియజేయాలని అనుకున్న ప్రముఖ డైరెక్టర్ శ్యామ్ బెనెగల్ శ్వేత విప్లవ పితామహుడిగా పేర్కొన్న వర్గీస్ కురియన్ జీవిత కథను అందరికీ తెలియజేయాలనుకున్నాడు. ఆయన జీవితాన్నిసినిమా రూపంలో ప్రపంచానికి తెలియజేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ సినిమాకు 5 లక్షల మంది తలో రెండు రూపాయలు అందించారు. ఇలా అందించిన వారు ఎవరో కాదు. పాడి రైతులు. వీరు సినిమా నిర్మించడానికి విరాళం ఇవ్వడమే కాకుండా ఆ సినిమాను చూసి విజయవంతం చేశారు.

‘మంథన్’ అనే సినిమా ప్రపంచంలో తొలి క్రౌడ్ ఫండింగ్ మూవీగా చరిత్రలో నిలిచిపోయింది. దేశంలో పాల ఉత్పత్తిని పెంచడం కోసం గుజరాత్ కు చెందిన వర్గీస్ కురియన్ ఎంతో కృషి చేశాడు. దీంతో ఆయన జీవితాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి సినిమా రూపంలో చిత్రీకరించాలని అనుకున్నాడు డైరెక్టర్ శ్యామ్ బెనెగల్. ఈ సినిమాను నిర్మించేందుకు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ముందుకు వచ్చింది. ఇందులో భాగస్వాములున్న 5 లక్షల మంది రైతులు తలా రూ.2 రూపాయలు ఇచ్చారు.

గిరీశ్ కర్నాడ్, సనీరుద్దీన్ షా, అమ్రిష్ పురి, స్మితా పాటిల్, తదితరులు కీలక పాత్రల్లో నటించిన మంథన్ సినిమాను విజయవంతం చేసేందుకు గుజరాత్ పాడి రైతులు గుంపులు గుంపులుగా థియేటర్లకు వచ్చారు. వర్గీస్ జీవిత కథను తెలుసుకొని ఎంతో సంతోషించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందడమే కాకుండా పలు జాతీయ అవార్డులను కూడా గెలుచుకుంది. వ్యవసాయ రంగంలో ఒక వ్యక్తి సాధించిన విజయాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు 5 లక్షల మంది రైతులు తమ తోడ్పాటునందించడంపై అప్పట్లో అందరూ అభినందించారు.

మంథన్ సినిమా చూపిన ప్రతి ఒక్కరు ఆయన అడుగు జాడల్లో నడవాలని ఆకాంక్షించారు. ఇప్పటికీ ప్రపంచంలో తొలి క్రౌడ్ ఫండింగ్ మూవీ ఏదంటే మంథన్ పేరునే చెబుతారు. అయితే ఈ సినిమాను నిర్మించేందుకు రైతులు ముందుకు రావడం ఎంతో గర్వకారణమని కొందరు అన్నారు. అంతేకాకుండా వ్యవసాయ రంగానికి చెందిన ఇలాంటి వ్యక్తుల జీవితాలను ప్రపంచానికి తెలియజేయాలని సూచించారు.

Leave a Comment