గాడ్ ఫాదర్ మూవీలో చిరు తండ్రి.. ఒకప్పటి స్టార్ హీరో..: ఎవరో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే నచ్చని వారుండరు. అయితే మొన్నటి వరకు వరుస ప్లాపులు కావడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. కానీ ఇటీవల ఆయన ‘గాడ్ ఫాదర్’ మూవీతో అదరగొట్టడంతో పండుగ చేసుకుంటున్నారు. గాడ్ పాధర్ మూవీ మలయాళ రీమేక్ అయినా చిరంజీవి నటనతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, నయన తార, జయదేవ్, సునీల్ లాంటి దిగ్గ నటులు ఉన్నారు. వీరంతా దాదాపు అందరికీ తెలిసిన నటులే. కానీ ఇందులో చిరంజీవి తండ్రి పాత్రలో ఓ వ్యక్తి నటించారు. ఆయన గురించి ఇప్పటి ప్రేక్షకులకు తెలియదు. కానీ ఆయన ఒకప్పుడు స్టారో హీరో. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా..?

అలనాడు వచ్చిన సినిమాల్లో కథకు ప్రాధాన్యం ఇచ్చేవారు. కథ బాగుండడంతో సినిమాలు సూపర్ డూపర్ హిట్టు కొట్టేవి. ఇలా సినిమాలు సక్సెస్ కావడంతో నటులతో పాటు టెక్నీషియన్స్ కు గుర్తింపు వచ్చేంది. 1980ల కాలంలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్న కె. విశ్వనాథ్ మదిలో నుంచి అరుదైన సినిమాలు వచ్చాయి. 1986లో ఆయన తీసిన ‘సిరివెన్నెల’ సినిమా గురించి ఎవ్వరూ మరిచిపోరు. ఆ సినిమా సాంగ్స్ ఇప్పటికీ మారుమోగుతున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించారు సర్వదమన్ బెనర్జీ. హీరోయిన్ గా సుహాసిని నటించిన విషయం తెలిసిందే.

సర్వదమన్ బెనర్జీ ఈ ఒక్క సినిమాతోనే స్టార్ హీరో అయ్యారు. కళ్లు లేని వ్యక్తిగా నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తరువాత మళ్లీ కనిపంచని ఆయన ఇన్నాళ్ల తరువాత తెలుగు స్క్రీన్ పై మెరిశాడు. 1965 మార్చి 14న ఉత్తరప్రదేశ్ లో జన్మించిన ఆయన కాన్పూర్ లో సెయింట్ అలోసియస్ స్కూల్లో చదివాడు. ఆ తరువత పూణె ఇనిస్టిట్యూట్ నుంచి పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత 1983లో ‘ఆది శంకరాచార్య’ సినిమాతో వెండితెరపై కనిపించాడు.

ఆధ్యాత్మిక సినిమాల్లో ఎక్కువగా నటించిన సర్వదమన్ 1986లో మాత్రం తెలుగులో విచత్ర క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నాడు. అనుకున్నట్లుగానే ఆయన ఆ క్యారెక్టర్ ద్వారా ఫేమస్ అయ్యారు. ఆ తరువాత చిరంజీవి నటించిన స్వయం కృషి సినిమాలోనూ ఈయన కనిపిస్తాడు. 2016లోనూ ధోనీ బయోగ్రఫీ పై వచ్చిన సినిమాలో కనిపించిన ఆయన చాలా ఏళ్ల తరువాత చిరంజీవితో మళ్లీ గాడ్ ఫాదర్ సినిమాలో ఆయన తండ్రిగా పోషించాడు. అయితే సినిమాల్లో నటించకపోయినా టీవీ సీరియళ్లలో మెరిశాడు. ఆధ్యాత్మిక సీరియళ్లలో ‘కృష్ణుడి’ పాత్రను ఎక్కువగా వేసేవారు.

Leave a Comment