సౌత్ స్టార్ నటి నయనతార ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకు ఆమె కవల పిల్లలకు జన్మనివ్వడమే. ఆమె నాలుగు నెలల కిందట ప్రముఖ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సరోగసి ద్వారా కవలలకు జన్మనివ్వడంపై సినీ ఇండస్ట్రీ అంతా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు బాగానే ఉంది. కానీ తాజాగా ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దంపతుల ఇంటికి కవలలు వస్తారని ఓ స్టార్ నటుడికి ముందే తెలుసట. అంతేకాదు వారికి పేర్లను అప్పుడే పెట్టాడట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

నయన్-విఘ్నేశ్ శివన్ ల మ్యారేజ్ సమయంలో సినీ ఇండస్ట్రీ నుంచి అతి కొద్ది మంది మాత్రమే అతిథులు హాజరయ్యారు. వీరిలో తమిళ హీరో, హీరోయిన్లు సూర్య-జ్యోతికలు కూడా వచ్చారు. వీరు పెళ్లికి రావడమే కాదు. అంతా ముందుండి వ్యవహారాలను చూసుకున్నారు. స్టార్ హీరోగా సూర్య బిజీగా ఉన్న నయన్ పెళ్లిలో మాత్రం హడావుడి చేస్తూ కనిపించారు. దీంతో సూర్యనే వీరి పెళ్లి చేశారని కోడై కూసింది. నయన్ కూడా వారి పెళ్లికి వచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఒతలు తెలిపింది. ఈ క్రమంలో సూర్య ఏం చేశాడంటే…?

నయన్ దంపతులను ఆశీర్వించిన తరువాత సూర్య వారితో ఇలా అన్నాడు. ‘మీకు త్వరలో కవలలు జన్మిస్తారు.. ఒకవేళ వారు పుడితె (ఉయిర్, ఉలగం) అనే పేర్లు పెట్టండి అని సూచించాడట. ఉయిర్ అంటే అర్థం.. ఉలగం అంటే ప్రపంచం అని మీనింగ్ కూడా చెప్పాడట. సూర్య చెప్పిన విధంగానే నయన్ దంపతులకు కవలలు జన్మించారు. దీంతో వారు ఇప్పటి నుంచే ఉయిర్, ఉలగం గా కొనసాగుతారని నయన్ ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో వచ్చిరాగానే నయన్ బిడ్డలు పేర్లను ముందే పెట్టేసుకున్నారని చర్చ సాగుతోంది.

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసిన నయన తార పెళ్లయిన తరువాత కూడా సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల చిరంజీవితో కలిసి గాడ్ ఫాదర్ లో మెరిసి ఆకట్టుకుంది. ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే నయన్ ఇంట కవలలు రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపింది. ముందు ముందు కూడా నయన్ జీవితం ఎంతో బాగుండాలని కోరుకుంటున్నామని అభిమానులు రిప్లై ఇస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here