సెక్సీగా కనపడాలంటే కష్టపడాలి..

సమంత సినీ పరిశ్రమ కు ఎంట్రీ ఇచ్చి 12 ఏళ్లు అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ కూడా సెక్సీ పాత్రల లో కానీ, ఐటమ్ సాంగ్ లు చేయలేదు.పుష్ప’లోని ఐటమ్‌ సాంగ్‌ ”ఊ అంటావా మావ.. ఊఊ అంటావా!” అంటూ అల్లు అర్జున్‌ సరసన ఆడిపాడింది. ఈ పాట లిరికల్‌ వీడియోకి ఎంత స్పందన వచ్చిందో థియేటర్లలో సామ్‌ డ్యాన్స్‌కీ అంతే ఆదరణ లభిస్తోంది.

తాజాగా ఈ పాట 100 మిలియన్‌ వ్యూస్‌ రాబట్టడంతో సమంత సంతోషాన్ని వ్యక్తం చేసింది.నా కెరీర్‌లో నేను మంచి, చెడు, ఫన్నీ, సీరియస్‌ పాత్రలు పోషించా. అలాగే ‘సామ్‌ జామ్‌’ చాట్‌ షోకి హోస్ట్‌గానూ చేశా. నేను చేసే ప్రతీ పనికి పూర్తి కష్టపడతా. కానీ, సెక్సీగా కనిపించటమంటే అంత తేలిక కాదు. దాని కోసం మరో లెవల్‌లో ఎంతో కష్టపడాలి. ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా!’ పాటకు మీరు చూపిస్తున్న ప్రేమకు నా ధన్యవాదాలు” అంటూ పోస్ట్

Leave a Comment