అట్టహాసంగా ట్రిపుల్ ఆర్ ప్రీ రీలిజ్ ఈవెంట్‌..

ఆదివారం రాత్రి ట్రిపుల్ ఆర్ చిత్రం ప్రీ రీలిజ్ ఈవెంట్‌ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ తెలుగు, హిందీ సెలెబ్రిటీలు సందడి చేశారు. ఈ వేడుకకు అతిథిగా హాజరైన సల్మాన్‌ ఖాన్‌ అభిమానుల కు ఇది శుభవార్త.. డిసెంబర్ 19న సూపర్ స్టార్ తన హిట్ చిత్రం ‘భజరంగీ భాయిజాన్’ రెండో భాగాన్ని ‘ఆర్ఆర్ఆర్’ వేదికపై అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం సల్మాన్ కెరీర్‌లో అత్యుత్తమ చిత్రాలలో ఒకటి..

ఈ స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి చేసినట్లు సల్మాన్ చెప్పుకొచ్చారు.భజరంగీ భాయిజాన్’ భారతదేశంలోని బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పటికి బాలీవుడ్ లో టాప్ 5 వసూళ్లు రాబట్టిన చిత్రాలలో ఒకటిగా ఈ మూవీ ఉండడం విశేషం.. ఇకపోతే త్రిపుల్ ఆర్ సినిమా కథ ఖచ్చితంగా జనాలకు నచ్చుతుందని చిత్ర యూనిట్ ధీమాను వ్యక్తం చేసింది. జనవరి 20న ఈ చిత్రం ప్రెక్షకులకు ముందుకు రానుంది.

Leave a Comment