వెనక్కి వెళ్ళిన భీమ్లా నాయక్.. రీలిజ్ వాయిదా..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్.. పవన్ కల్యాణ్ – రానా దగ్గుబాటిల కాంబినేషన్ లో మల్టీస్టారర్ గా వస్తోన్న సినిమా భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పన్ కోషియమ్ సినిమాకి రిమెక్ ఇది. ఈ చిత్ర షూటింగ్ చివరి షెడ్యూల్ మిగిలి వుంది. కానీ రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ఖరారు చేశారు.సినిమా ఇంకా వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరుపుకుంటుంది. అది పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు సినిమా ప్రమోషన్స్ చేపట్టాల్సి వుంటుంది.

20 రోజుల్లో పూర్తవుతాయా ? ఖచ్చితంగా సినిమా విడుదల వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.అయితే జనవరిలో సంక్రాంతి పండుగకు విడుదల అవుతుందని వార్త విని పించింది. కానీ ఇప్పుడు ఆ రేసు నుంచి తప్పుకున్న ట్లుగా టాక్ బాగా వినిపిస్తోంది. కానీ దీనిపై నిర్మాత నాగవంశీ మాత్రం సంక్రాంతి బరిలోనే దిగబోతోందని క్లారిటీ ఇచ్చారు. అందుథున్న సమాచారం ప్రకారం 2022 ఫిబ్రవరి 4న సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. అదే సమయంలో ఆ డేట్ కు విడుదల కావాల్సిన ‘ఆచార్య’ మార్చి 25కు పోస్ట్ పోన్ అవుతుందని ప్రచారం జరుగుతోంది.. ఏది ఏమైనా కూడా చిత్ర యూనిట్ మరో అప్డేట్ ఇచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే..

Leave a Comment