వామ్మో..ఆ హీరోయిన్ ఏమైంది?

తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోయిన్లు వివిధ రకాల జబ్బుల బారిన పడటం వినే ఉంటారు. మొన్నామధ్య హీరోయిన్ సొనాలి బింద్రె కూడా క్యాన్సర్ బారిన పడి, కొలుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా క్యాన్సర్ బారిన పడింది.హంసా నందిని రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నట్లు ప్రకటించింది. జీవితం తనపై విసిరిన ఈ సవాల్‌ను నిర్భయంగా ఎదుర్కొంటానని, ధైర్యంగా ముందుకు సాగుతానని తెలిపింది.

నాలుగు నెలల క్రితం రొమ్ములో గడ్డ ఉన్నట్లు అనిపించి డాక్టర్ దగ్గరకు వెళ్తే.. టెస్ట్‌లు చేశాక బ్రెస్ట్ క్యాన్సర్ థర్డ్ స్టేజ్‌లో ఉందని స్పష్టం చేశారని వివరించింది. సర్జరీ చేసి, అది ఇతర ప్రదేశాలకు వ్యాపించలేదని వైద్యులు తెలిపారని చెప్పింది.18 నెలల క్రితం ఈ భయంకరమైన వ్యాధితో తల్లిని కోల్పోయానన్న హంసా నందిని.. తనకు మరో రొమ్ము క్యాన్సర్‌కు 70శాతం, అండాశయ క్యాన్సర్‌కు 30శాతం చాన్స్ ఉన్నట్లు చెప్పింది.. ఈ వ్యాధి నన్ను ఏమి చేయలేదు నేను త్వరలోనే మళ్ళీ సినిమాల లోకి వస్తాను అని ధీమాను వ్యక్తం చేసింది.

Leave a Comment