ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్..

డైరెక్టర్ రాజమౌలి,యంగ్ టైగర్ ఎన్టీఆర్,చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్..ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ భారీ బడ్జెట్‌ సినిమా ట్రైలర్‌ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది..ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కనున్నట్లు తెలిసిందే. అందుకే జక్కన్న మూవీ విషయాలను గొప్యంగా ఉంచారు.ఇకపోతే ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపొయె గుడ్ న్యూస్ ను చెప్పనున్నాడు..https://twitter.com/tarak9999/status/1467728035872854017?s=20

డిసెంబర్‌ 9న ట్రైలర్‌ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. జనవరి 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండడంతో.. ప్రమోషనల్‌ కార్యక్రమాలు జోరందుకున్నాయి.ట్రైలర్‌ మరో మూడు రోజుల్లో ఉంటుందని తెలిపింది. ఇక పోస్టర్‌ను చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. కండలు తిరిగిన దేహంతో, ఒంటి నిండా రక్తపు మరకలతో ఎన్టీఆర్‌ స్టన్నింగ్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు ఆనందాన్ని అందించిందనే చెప్పాలి.. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన అన్నీ సినిమా పై అంచనాలను పెంచుతున్నాయి..మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..

Leave a Comment