భాదలో కార్తీక్.. మోనిత కు పట్టలేని ఆనందం..కట్ చేస్తే..

కార్తీక్ దీపం సీరియల్  ఇప్పుడు జనాలకు మళ్ళీ బోర్ కొడుతుంది.. మొన్నటి ఎపిసోడ్ లో కార్తీక్ చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే.అదే ఆలోచనలో ఉంటూ కార్తీక్ ఇంటికి వస్తాడు.సర్జరీ బాగా జరిగిందా అంటే..కార్తీక్ ఏం మాట్లాడడు. పిల్లలను చూసుకుంటాడు. మీకేం కాదమ్మా, నిండు నూరేళ్లు జీవిస్తారు అంటాడు. సౌందర్యకు అనుమానం వస్తుంది. పిల్లలను ఐస్ క్రీమ్ పేరుతో సైడ్ చేస్తుంది. కార్తీక్ ను అడుగుతుంది. కార్తీక్ ఏం లేదు మమ్మీ అంటాడు.

సౌందర్య ఏం జరిగింది, ఎందుకు అంత డల్ గా ఉన్నావు అంటే..కార్తీక్ అలిసిపోయాను మమ్మీ అని వెళ్లిపోబోతాడు. ఆనంద్ రావు ఏమైందిరా ఆ మోనిత వచ్చి ఏమైనా గొడవచేసిందా అంటే.ఏం లేదు అని వెళ్లిపోతాడు..ఈ విషయం తెలుసుకున్న మోనిత ఆనందం తో ఎగిరి గంతేస్తుంది.కట్ చేస్తె..కార్తీక్ అలా బాధపడతూ ఉన్న సమయంలో సౌందర్య, ఆనంద్ రావులు వస్తారు. ఏమైంది రా అని మళ్లీ అడుగుతారు. కార్తీక్ అప్పుడు జరిగింది చెప్తాడు.కార్తీక్, సౌందర్య కలిసి పేషెంట్ ఇంటికి వెళతారు.. అక్కడ అతని భార్య ఏడుపు చూసి భాదపడతారు..తర్వాత కార్తీక్ ఆవిడ చేతులు పట్టుకుని..నీకు అన్యాయం జరిగింది కాదనను, పోయిన మనిషి ప్రాణాలను తెచ్చివ్వలేను..కానీ ఒక్క పని చేయగలను అమ్మా అని సౌందర్య చేతలో ఉన్న ఫైల్ తీసుకుని ఆమెకు ఇస్తాడు..దాంతో ఎపిసోడ్ పూర్తీ అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో మోనిత ఎం చెస్తుందొ చూడాలి..

Leave a Comment