బన్నీ ఫ్యాన్స్ కు జాతరే.. ట్రైలర్ లోనే సినిమా..

అల వైకుంఠపురంలో సినిమా భారీ సక్సెస్ ను అందుకున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా తర్వాత ఇప్పుడు సుకుమార్ కాంబినేషన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమానే పుష్ప.. రస్మిక మందన్న కథానాయిక.పుష్ప సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. రెండు భాగాలు గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సుకుమార్‌. సక్సెస్ పుల్ మూవీ మేకర్స్ కి కేరాఫ్ గా ఉండే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన.. టీజర్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ భారీ స్థాయిలో వచ్చింది. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్ లో బన్ని తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. సినిమాలో నటించిన వాళ్లంతా కూడా అద్బుథంగా నటించారు. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచుతున్నాయి.ఈ నెల 17న సినిమా థియేటర్ లో సందడి చేయనుంది..ఆలస్యం ఎందుకు భారీ టాక్ ను అందుకున్న ఆ ట్రైలర్ ను మీరు చూడండి..

https://youtu.be/Q1NKMPhP8PY

Leave a Comment