స్పీడ్ పెంచిన చిరు.. ఒకే నెలలో అన్ని సినిమాలా..!

తెలుగు చిత్ర పరిశ్రమ లో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో హిట్ సినిమాలను అందించిన ఘనత ఆయనది.ఖైదీ నెంబర్ 150 సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.చిరు అందరి హీరో ల మాదిరిగా కాదు.. వరుస సినిమా లలో నటిస్తున్నాడు..ఏకంగా ఒకేసారి నాలుగు సినిమాల్లో నటించడం విశేషం. ఒకే నెలలో అత్యధిక సినిమాలు చేస్తూ ప్రస్తుతం యువహీరోలకు కూడా సాధ్యం కాని విధంగా ముందుకెళ్తున్నారు.

గతేడాది తాను చేయబోయే చిత్రాల గురించి చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం తన 152వ చిత్రం ‘ఆచార్య’లో నటిస్తోన్న చిరు.. తన 153వ సినిమాగా రానున్న లూసిఫర్‌ రీమేక్‌ ‘గాడ్‌ ఫాదర్‌’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కొన్ని నెలల కిందట ప్రారంభమైంది.బోలా శంకర్ సినిమా తో పాటుగా మరో సినిమా ను కూడా లైన్ లో పెట్టాడు.ఎంతైనా చిరంజీవి అంటే ఆ మాత్రం ఉండాలి.. మరి ఈ సినిమాలు చిరు కు ఎలాంటి పేరును తీసుకోస్తాయో చూడాలి..

Leave a Comment