పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘భీమ్లా నాయక్‌’ అప్పుడే రిలీజ్..

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్‌’..పవన్‌ కల్యాణ్‌, రానా కథానాయకులుగా తెరకెక్కుతున్న చిత్రమిది. సాగర్‌ కె. చంద్ర దర్శకుడు.మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’ చిత్రానికి రీమేక్‌గా ‘భీమ్లా నాయక్‌’ రూపొందుతోంది. నిత్యా మేనన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు. దర్శకుడు త్రివిక్రమ్‌ మాటలు రాస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

షూటింగ్ ను పూర్తీ చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్దం అవుతుంది.అయితే ఈ సినిమా విడుదల పై రక రకాల పుకార్లు వస్తున్నాయి. తాజాగా వాటికి చిత్ర యూనిట్ చెక్ పెట్టింది.ఈ సినిమాని 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ఎప్పుడో ప్రకటించింది.విడుదల కు కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది. ఇది నిజంగా ఫ్యాన్స్ కు సంక్రాంతి పండగే..మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే

Leave a Comment