తారక్ నా.. మజాకానా.. అన్నీ భాషల్లో..

ఎన్టీఆర్,రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్.రాజమౌలి డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతుంది.సినిమా ఎప్పుడొస్తుందా అని దేశం మొత్తం ఎదురు చూస్తోంది. వచ్చే ఏడాది జనవరి 7న పాన్ ఇండియా స్థాయిలోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ థియేటర్స్ లో మాస్ జాతర చేయబోతోంది. ఇప్పటి వరకూ విడుదలైన టీజర్స్, ట్రైలర్, సింగిల్స్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ రావడంతో సినిమాపై మరింతగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమాలోని తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ఎప్పుడో పూర్తి చేసిన తారక్.. మరో మూడు భాషలకు తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం టాలీవుడ్ లో హాట్ చర్చగా మారింది. ఎన్టీఆర్ నటిస్తూన్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే.ఇలా తనే అన్నీ భాషల్లొ చెప్పుకోవడం ప్లస్ అవుతుంది. తారక్ వాయిస్ అన్నీ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో చూడాలి.ఇలా క్లిక్ అయితే తారక్ రేంజ్ మారినట్లే..

Leave a Comment