మహేష్ కు సర్జరీ.. అప్పటివరకూ బ్రేక్..

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కొద్ది రోజులు సినిమాలకు బ్రేక్ తీసుకున్నాడు.కొన్ని రోజులుగా మోకాలి సమస్యలతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఆయన మోకాలికి సర్జరీ చేయించుకోవడనికి రెడీ అయిన సంగతి కూడా తెలిసిందే.స్పెయిన్‌లో మహేష్ బాబు మోకాలికి ఆపరేషన్‌ జరిగిందట.అనంతరం మహేష్ బాబు దుబాయ్‌లో విశ్రాంతి తీసుకోవడానికి చేరుకున్నట్టు తెలుస్తుంది.

ఈ ఆపరేషన్ తర్వాత రెండు నెలలు రెస్ట్ అవసరమని వైద్యులు తెలిపారు.అనంతరం ‘సర్కారు వారి పాట’ బ్యాలన్స్ షూటింగ్లో మహేష్ పాల్గొంటాడు. ‘సర్కారు వారి పాట’ షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. పరశురామ్ బుజ్జి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 2022 ఏప్రిల్ 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలైన ‘మైత్రి మూవీ మేకర్స్’ ’14 రీల్స్ ప్లస్’ వారు.ఈ చిత్రానికి సంబంధించి ఇంకా ఒక ఫైట్, మూడు పాటల చిత్రీకరణ పూర్తిచేయాల్సి ఉందని సమాచారం..ఈ సినిమా అనంతరం త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు.

Leave a Comment