సాయి ధరమ్ తేజ్ సినిమాలో పవన్ కల్యాణ్..

మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్, దేవా కట్టా డైరక్షన్ లో తెరకెక్కిన చిత్రం రిపబ్లిక్..ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ చేసినా సినిమా టైం లో సాయి ధరం తేజ్ కు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ లో ఉండటంతో సినిమా కమర్షియల్ గా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు..ఇది ఒక పొలిటికల్ స్టోరీ.. జనాల మనోభావాలు ఎలా ఉంటాయో అనేది కథ. కాగా, ఈ సినిమాకు సీక్వెల్ సినిమా వస్తుందని టాక్ వినిపిస్తోంది.

ఈ సీక్వల్ లో సాయి ధరం తేజ్ హీరోగా కాకుండా పవన్ కళ్యాణ్ ను పెట్టి తీసే ఆలోచనలో ఉన్నారట. సాయి ధరం తేజ్ రిపబ్లిక్ సినిమాను చేసిన దేవా కట్ట పవన్ కళ్యాణ్ తో రిపబ్లిక్ 2 తీస్తాడని చెప్పుకుంటున్నారు. పవన్ ఆల్రెడీ పార్టీ పెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడు. కాబట్టి ఇలాంటి సినిమాలు అతని పొలిటికల్ మైలేజ్ పెంచే అవకాశం ఉందని.. రిపబ్లిక్ 2 కథ నేరుగా పవన్ కే వినిపించి ఆయనతోనే చేయాలని ఫిక్స్ అయ్యారట.పవన్ తో సినిమా వర్కౌట్ అయితే ఇతను స్టార్ అవ్వడం ఖాయం.మరి ఎవరితో సినిమా వుంటుంది అనేది తెలియాల్సి వుంది.

Leave a Comment