గుడ్ న్యూస్.. సామన్యులకు ఊరట..

కరోనా వల్ల తీవ్ర ఆర్థిక సంక్షొభానికి గురైన ప్రజలకు నిత్యావసర సరుకులు భారీ షాక్ ను ఇస్తున్నాయి. సామన్యుల పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. కరోనా మూలాలు తగ్గినా కూడా సరుకుల రేట్లు పది రేట్లు పెరుగుతున్నాయి. రొజువారి కూలి పని చేసుకొనే వారికి ముద్ద దిగడం లేదంటే నమ్మాలి.ఒకవైపు సరుకులు, మరొక వైపు వంట గ్యాస్, నూనెలు కూడా భారీ స్థాయికి చేరుకున్నాయి. రోజు రోజుకు పెరిగే మాట తప్ప ఎక్కడా తగ్గినట్లు కనిపించలేదు..

అయితే ఈ విషయం పై కేంద్రం పలు చర్చలు చేశారు.వీటిపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నుంచి విమర్శలు రావడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా దేశంలో వంట నూనెల ధరల పెరుగుదలను నియంత్రణ చేయడానికి ఆలొచిస్తున్నారు. అందులో భాగంగా శుద్ధి చేసిన నూనెలపై దిగుమతి సుంకం తగ్గింపు తర్వాత మార్కెట్లలో గత వారం సోయాబీన్ నూనె ధరలు తగ్గించడంతోపాటు మరి కొన్ని నూనెల ధరలు తగ్గించటం పై కేంద్రం దృష్టి పెట్టింది.

ఇది ఇలా ఉండగా వేరుశెనగ ధరలు పడిపోవడంతో రైతులు పండించిన పంటను తక్కువ ధరకు విక్రయించేందుకు సిద్ధంగా లేరని సంబంధిత వర్గాలు తెలిపాయి.. దాంతో ఆనూనె ధరలు కూడా గతంలో కన్నా తగ్గినట్లు తెలుస్తుంది.చలికాలంలో పామాయిల్ ధరలు కూడా తగ్గుతాయి. ధరలు తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా గత సోమవారం 2022 మార్చి వరకు శుద్ధి చేసిన పామాయిల్‌పై  17.5 శాతం నుంచి 12.5 శాతానికి కస్టమ్స్ చార్జీలను      తగ్గించింది. మొత్తానికి నూనెల ధరలు ఊరట కలిగిస్తున్నాయి.

Leave a Comment